ప‌వ‌న్‌తో విడాకుల వెన‌క అస‌లు సీక్రెట్‌పై రేణు కామెంట్‌

ప‌వర్‌స్టార్ పవ‌న్‌క‌ళ్యాణ్‌, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ వివాహ బంధం ఎందుకు విచ్ఛిన్న‌మైందో ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌దు. త‌న‌తో పాటు బ‌ద్రి, జానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రేణును ప‌వ‌న్ ఎంతో ఇష్టంగా ప్రేమించారు. వీరికి అకీరా, ఆద్య అనే పిల్ల‌లు కూడా ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటే ఈ జంట స‌డెన్‌గా 2010లో విడాకులు తీసుకోవ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు.

వీరిద్ద‌రు ఎందుకు విడాకులు తీసుకున్నార‌న్న‌దానిపై ఇప్ప‌ట‌కీ ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. ఈ విష‌యంపై ప‌వ‌న్ ఎప్పుడూ స్పందించ‌లేదు. రేణును ఇప్ప‌టికే చాలా ఇంట‌ర్వ్యూల్లో ఈ ప్ర‌శ్న అడిగితే అవ‌న్నీ ఎందుకుని రివ‌ర్స్ ప్ర‌శ్న వేసి త‌ప్పించుకునేది. తాజాగా ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్‌కు రేణు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ ఆమె అదే ఆన్స‌ర్ ఇచ్చింది. అయితే చిన్న ట్విస్ట్ ఏంటంటే త‌న జీవిత చ‌రిత్ర‌ పుస్త‌కంలో మాత్రం తాను ప‌వ‌న్ ఎందుకు విడాకులు తీసుకున్నామో చెపుతాన‌ని చెప్పింది.

ఇక విడాకుల‌పై స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పిన రేణు అప్ప‌టి వ‌ర‌కు త‌న‌లోనే ఈ నిజాన్ని దాచుకుంటాన‌ని చెప్పింది. ఇప్పుడు ఈ విష‌యం గురించి మాట్లాడి లేనిపోని త‌లనొప్పులు తెచ్చుకోవ‌డం ఇష్టంలేద‌ని రేణు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. జ‌రిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోక‌డ‌ద‌న్న రేణు అదంతా త‌న ఖ‌ర్మ అని వాపోయింది.

ఇక ఫైన‌ల్‌గా ఆమె మ‌రో ట్విస్ట్ ఇచ్చింది. విడాకులు వ‌ద్ద‌ని తాను చివ‌రి వ‌ర‌కు బ‌ల‌వంతం చేశాన‌ని, అయితే చివ‌ర్లో మాత్రం ఆ ప్ర‌య‌త్నాన్ని వ‌దులుకున్నాన‌ని చెప్పింది. విడాకులు వ‌ద్ద‌న్న ప్ర‌య‌త్నాన్ని తాను మాత్రం బ‌లవంతంగా ఎన్ని రోజులు ఆప‌గ‌ల‌న‌ని అందుకే చివ‌ర‌కు విడాకులు త‌ప్ప‌లేద‌ని రేణు ఆవేద‌నతో తెలిపింది. ఇక జీవితంలో వృద్దాప్యంతో ఉన్న‌ప్పుడే జీవిత చ‌రిత్ర రాయ‌డం మంచిద‌ని, అయితే అప్ప‌ట‌కీ త‌న‌కు పెళ్ల‌య్యి ఉంటే మంచిద‌ని ఆమె చెప్పింది. రేణు చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే విడాకుల కోసం ప‌వ‌నే బ‌ల‌వంతం చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య అస‌లేం జ‌రిగిందో ?  వారికే తెలియాలి.