బాహుబ‌లి-2 గురించి షాకింగ్ రిపోర్ట్‌

`క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? ` ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. అంద‌రిలోనూ టెన్ష‌న్ పెరిగిపోతోంది. బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఎలా ఉండ‌బోతోంద‌నే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొద‌లైంది. బాహుబ‌లి-1లో కేవ‌లం కేరెక్ట‌ర్‌ల‌ను ప‌రిచ‌యం చేసి.. విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దినా.. క‌థ‌నం నెమ్మ‌దిగా ఉండ‌టంతో ఒకింత నిరుత్సాహ‌ప‌డ్డారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్పుడ బాహుబ‌లి-2 మాత్రం అంద‌రి అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని టాక్‌. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా…

అంద‌రిక‌ళ్లూ ఇప్పుడు బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ మీదే ఉన్నాయి. రాజ‌మౌళి ఈ క‌థ‌ని ఎలా ముందుకు న‌డిపిస్తాడు? ఎన్ని మ‌లుపులు తిప్పుతాడు.. అనేదానికంటే.. బాహుబ‌లి 1 రికార్డుల్ని బాహుబ‌లి 2 ఏమేర దాటుకొంటూ వెళ్తుంది?? అనే ఆలోచ‌న‌లే ఎక్కువగా ఉన్నాయి. విజువ‌ల్‌గా రాజ‌మౌళి ఏం చేయ‌బోతున్నాడు? ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? అంటూ… ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా రూ.1000 కోట్లు సాధిస్తుంద‌ని కొంద‌రు, 1తో పోలిస్తే 2 తేలిపోతుంద‌ని కొంద‌రు.. ఇలా ఎవ‌రి జోస్యాలు వాళ్లు చెబుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. బాహుబ‌లి 2 అదిరిపోయింద‌ట‌! బాహుబ‌లి- 1కీ రెండో భాగానికీ అస‌లు పోలికే లేద‌ని స‌మాచారం. బాహుబ‌లి 2తో పోలిస్తే తొలిభాగం న‌థింగ్ అని చెబుతున్నారు. పార్ట్ 1 సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యినా రాజ‌మౌళిని విమర్శించిన వాళ్లున్నారు. అయితే ఈసారి అటు టెక్నిక‌ల్ గానే కాకుండా.. ఇటు ఎమోష‌న్స్ విష‌యంలోనూ రాజ‌మౌళి చాలా కేర్ తీసుకొన్నాడ‌ని తెలుస్తోంది. ఛ‌త్ర‌ప‌తి, మ‌గ‌ధీర‌లో క‌నిపించి, బాహుబ‌లి పార్ట్ 1లో మిస్స‌యిన ఎమోష‌న్స్‌… బాహుబ‌లి 2లో క‌నిపిస్తాయ‌ని, ఈ సినిమాని మ‌రో లెవిల్‌కి తీసుకెళ్లేవి ఆ ఎమోష‌న్ సీన్సే అని చెబుతున్నారు.

విజువ‌ల్‌గా అయితే.. బాహుబ‌లి 1తో పోలిస్తే ప‌ది రెట్లు మిన్న‌గా తీర్చిదిద్దాడ‌ట రాజ‌మౌళి. సెకండాఫ్‌లో మ‌రిన్ని అద్భుతాలకు చోటిచ్చాడ‌ని తెలుస్తోంది. బాహుబ‌లి 2 చూశాక‌.. వ‌న్ గురించి ఎవ్వ‌రూ మాట్లాడుకోర‌ని.. బాహుబ‌లి 2తో ఇండియ‌న్ సినిమా స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. బాహుబ‌లి-2 మ‌రిన్ని రికార్డులు సాధించి… తెలుగు సినిమా స్థాయిని మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళ్లాల‌ని కోరుకుందాం!!