బాహుబ‌లి 2లో హైలెట్ ఇదే … విని ఆశ్చర్యపోతున్న అభిమానులు

బాహుబలి మొదటి భాగం సినిమా తెలుగు వారితో పాటు కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌, మ‌ల్లూవుడ్‌, బాలీవుడ్ జ‌నాల‌ను ఓ రేంజ్‌లో అల‌రించింది. బాహుబ‌లి ఏకంగా రూ.600 కోట్లు కొల్ల‌గొట్టింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ టు నార్త్ వ‌ర‌కు అన్ని భాష‌ల సినీ అభిమానులు బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ట్రైల‌ర్ యూట్యూబ్ రికార్డుల‌ను షేక్ చేస్తూ గూగుల్‌కే షాక్ ఇస్తూ వ‌ర‌ల్డ్ వైడ్ ట్రెండింగ్స్‌లో టాప్ ప్లేసులో ఉంది. ఇక బాహుబ‌లి 2 ఆడియో విష‌యంలో ఓ మ్యాట‌ర్ లీక్ అయ్యి ఇండ‌స్ట్రీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. బాహుబ‌లి 2 పాట‌ల విష‌యంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి స్పెష‌ల్ కేర్ తీసుకున్నాడ‌ట‌.

కీర‌వాణే స్వ‌యంగా నాలుగు పాట‌ల‌కు లిరిక్స్ కూడా ఇచ్చారు. మొత్తం బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ఆల్బ‌మ్‌లో ఐదు సాంగ్స్ ఉండ‌గా నాలుగు పాటలు సందర్భానికి తగ్గట్టుగా ఉన్నాయట. ఒక పాట ప్రభాస్ – అనుష్క మధ్య రొమాన్స్‌ను వర్ణిస్తూ ఉంటుంద‌ట‌.

 ” హంస వానా ” అంటూ సాగే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుంది అని విశ్వసనీయ వర్గాల ద్వరా తెలుస్తోంది. పచ్చ బొట్టేసినా పాట రేంజ్ లో ఇది హిట్ అవుతుంది అంటున్నారు. ఇక బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.