అంత అవసరమా జానకీ!

‘గోపాల గోపాల’ సినిమాలో అందాల సన్యాసినిగా కనిపించిన దీక్షా పంత్‌, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఓ పాటలో హీటెక్కించింది. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ బక్క పలచ కమెడియన్‌ ధన్‌రాజ్‌తో ‘బంతిపూల జానకి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం గ్లామర్‌లో రెచ్చిపోయిందట దీక్షా పంత్‌. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట. అయినాసరే చిన్న హీరోతో సినిమాలో ఇంతలా గ్లామర్‌ ఒలకబేసేయాలా? అని అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో.

అన్నీ ఉన్నా మంచి అవకాశాలైతే దీక్షా పంత్‌కి సొంతం కావడంలేదు. అవకాశాల్లేకనే ఏదో ఒక సినిమాలో నటించేయాలని తొందరపడిపోతున్నట్టుంది. ఏమో దీక్షా పంత్‌ అదృష్టం కలిసొచ్చి ‘బంతి పూల జానకి’ హిట్టయితే ఆమె దశ తిరిగిపోవచ్చు. అందంతో ఆకట్టుకొని అయినా సరే సినిమాల్లో నిలదొక్కుకోవాలన్న ఆమె కోరిక ఫలించే తరుణం ఇంకెన్నాళ్లో. ఏ హీరో కూడా ఈ ముద్దుగుమ్యని కరుణించడం లేదు. కేవలం హీరోయిన్‌గానే కాదు ఏ క్యారెక్టర్‌లోనైనా నటించడానికి సై అంటోంది ఈ మద్దుగుమ్మ దీక్షా పంథ్‌. అందుకే పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో చేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉండి కూడా ధనరాజ్‌లాంటి ఒక సాధారణ కామెడీ హీరో పక్కన హీరోయిన్‌గా నటించడానికి సిద్ధమైపోయింది. అయినా ఈ రోజుల్లో ఓ సినిమాని తక్కువగా, ఇంకో సినిమాని ఎక్కువగా చూడ్డానికి వీల్లేదు. పెద్ద సినిమా ఫెయిలవ్వొచ్చు, చిన్న సినిమా హిట్టవచ్చు. బంతి పూల జానకిగా దీక్షా పంత్‌కి లక్‌ కలిసొస్తుందేమో చూడాలిక.