కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన […]

జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే […]

వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌…షాక్‌లో చంద్ర‌బాబు

విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూకుంభ‌కోణం న్యూస్ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విప‌క్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే గురువారం వైసీపీ అధినేత జ‌గ‌న్ సేవ్ విశాఖ పేరుతో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధ‌ర్నాకు కాస్త బాగానే జ‌నాలు అటెండ్ అయ్యార‌ని సీఎం చంద్ర‌బాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]

ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు […]

వైసీపీలో జగన్ రాజు అయితే మంత్రి ఆయనేనా!

వైసీపీలో క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా ఎవ‌రంటే ముక్తకంఠంతో వినిపించే పేరు అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి! మ‌రి ఆయ‌న త‌ర్వాత? ఎవ‌రు అంటే కొంత ఆలోచించాల్సిందే! ఇప్ప‌టివ‌రకూ ఆ అవ‌స‌ర‌మే రాలేదు కూడా! కానీ పార్టీలో క్ర‌మక్ర‌మంగా, చాప‌కింద‌నీరులా ఒక వ్య‌క్తి మాత్రం.. షాడో జ‌గ‌న్‌లా మారిపోయారు. అధినేత కూడా త‌న మీద ఆధార‌ప‌డేలా చేసేసుకున్నారు. ఇక జ‌గ‌న్ బంధువుల‌ను.. ఆయా నియోజ‌క‌వర్గాల‌కే ప‌రిమితం చేసేశారు! సీనియ‌ర్ల‌ను కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌రికి రానివ్వ‌కుండా వాళ్ల‌ని తొక్కేస్తున్నారు. మరి […]

నంద్యాల రాజ‌కీయం ట్విస్టులే ట్విస్టులు

ఉప ఎన్నిక‌ల వేళ క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం రోజు రోజుకు ఎటు మ‌లుపులు తిరుగుతుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజ‌కీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్క‌డ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌గా ఇప్పుడు అదే బాట‌లో మ‌రో కీల‌క వ్య‌క్తి ప‌య‌నిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి నంద్యాల‌లో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని… […]

వైసీపీకి ఆ మూడు పార్టీల మ‌ద్ద‌తు

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో ఇప్పుడు కొత్త జోష్ క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రు పార్టీలో ఉంటారో? ఎవ‌రు ఎప్పుడు జంప్ చేస్తారో? తెలియ‌ని పెద్ద సందిగ్ధావ‌స్థ‌లో కూరుకుపోయిన వైసీపీ నేత‌లు స‌హా అధినేత జ‌గ‌న్‌లో ఇప్పుడు ఏదో తెలియ‌ని కొత్త జోష్ క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు స‌హా లోక్‌స‌త్తా పార్టీలు ఇప్పుడు జ‌గ‌న్ చెంత చేరి.. జై కొడుతున్నాయ‌ట‌. అదే స‌మ‌యంలో […]

ఫైర్‌బ్రాండ్‌కు రోజాకు జగన్ క్లాస్ .. దానికి రోజా రియాక్షన్ ..!

జ‌గ‌న్ పార్టీ వైసీపీలో త‌న‌కు ఎదురు లేద‌ని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు క‌ష్టాలు స్టార్ట‌య్యాయ‌ని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ నుంచేన‌ని స‌మాచారం. త‌న జ‌బ‌ర్ద‌స్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. స‌డెన్‌గా ఇలా పార్టీ అధినేత‌కు దొరికిపోవ‌డం ఏంటి? జ‌గ‌న్‌తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగ‌జారింది? అస‌లేం జ‌రిగింది? అంటే.. స్టార్టింగ్‌లో […]

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ..!

ఏపీ విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధిస్తే తాను మంత్రి అవ్వ‌వ‌చ్చ‌ని ప్లాన్ వేస్తోన్న వైవీ ఈ క్ర‌మంలోనే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లానింగ్‌లో ఉన్న‌ట్టు ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కంతో […]