సైడ్ అవుతున్న తమ్ముళ్ళు..టీడీపీకి డ్యామేజ్.!

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనలు తెలియజేసే విషయంలో గాని, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో గాని తెలుగు తమ్ముళ్ళు బలంగా ఉన్నారా? అంటే ఏ మాత్రం లేరనే చెప్పాలి. ఏదో బాబు అరెస్ట్ అయిన రోజు కాస్త హడావిడి చేశారు. తర్వాత రోజు బంద్ అన్నారు గాని..పూర్తి స్థాయిలో తమ్ముళ్ళు బయటకురాలేదు. ఏదో అక్కడకక్కడ కార్యకర్తలు మాత్రం పోరాడుతున్నారు. అసలు టి‌డి‌పి అధికారంలో ఉండగా హడావిడి చేసిన నేతలు..ఇప్పుడు బాబు కోసం అండగా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. […]

బాబు అరెస్ట్‌.. వైసీపీకి ప్లస్‌ ఆర్ మైనస్‌…?

చంద్రబాబు అక్రమ అరెస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు కావడంతో వైసీపీలో మంట పెరిగింది. ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏపీలోని అన్ని పక్షాలతోపాటు.. జాతీయ నేతలు.. మీడియా కూడా చంద్రబాబు అరెస్టుపై విరుచుకుపడటంతో ఏం చేయాలో తోచని స్థితికి చేరుకుంది. దీంతో ఏకంగా సజ్జల వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచిన వ్యవహారం […]

ప్రకాశం ‘ఫ్యాన్’ వార్..సాయిరెడ్డి ముందే రచ్చ.!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో అంతర్గత పోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ముందు నుంచి అక్కడ కీలక నేతలైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ విభేదాలు నేపథ్యంలోనే బాలినేని..ఈస్ట్ రాయలసీమ కో ఆర్డినేటర్ పదవిని సైతం వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ బాధ్యతలని విజయసాయి రెడ్డి తన భుజాన వేసుకున్నారు. దీంతో మొదట ప్రకాశం జిల్లాలోనే రచ్చకు బ్రేకులు వేసేందుకు సమావేశాలు పెడుతున్నారు. అయినా సరే […]

బాబుకు సపోర్ట్..మోసం లేదట?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్ధతు బాగానే వస్తుంది. కానీ ఆయన పొత్తు కోసం ఎదురుచూసిన బి‌జే‌పి నుంచి కాకుండా..ఇండియా కూటమి నేతల నుంచి మద్ధతు ఎక్కువ వస్తుంది. ఇప్పటికే బాబు అరెస్ట్‌ని మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ ఖండించిన విషయం తెలిసిందే. ఇదంతా బి‌జే‌పి, వారి మిత్రులు చేస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు. అంటే బి‌జే‌పితో వైసీపీ రహస్య మిత్రులుగా ఉన్నారనే వాదన తీసుకొస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు […]

వైసీపీకి సూపర్ ఛాన్స్..వదులుకోకూడదు.!

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్ళడం..వైసీపీకి మంచి అవకాశం అవుతుందా? ఈ ఛాన్స్ సరిగా వాడుకోకపోతే వైసీపీకి మైనస్ అవుతుందా? అంటే అవుననే చెప్పాలి. బాబు జైలుకు వెళ్ళడం ద్వారా టి‌డి‌పి శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. క్షేత్ర స్థాయిలో పోరాటపటిమ తగ్గుతుంది. దీని వల్ల ప్రతిరోజూ వైసీపీ ప్రభుత్వంపై చేసే విమర్శలు తగ్గుతాయి. తమ్ముళ్ళ ఫోకస్ మొత్తం బాబు జైల్లో ఉన్నారు..బయటకు ఎప్పుడు వస్తారనే దానిపైనే ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ మరింతగా ప్రజల్లోకి వెళ్ళి వారి […]

నో సింపతీ..తమ్ముళ్ళ ఆవేదన.!

చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అది ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉందనగా అరెస్ట్ అయ్యారు. కేవలం జగన్ ప్రభుత్వం కక్ష కట్టి బాబుని అరెస్ట్ చేసిందని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ప్రేమ్ చందర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి లాంటి వారు ఉన్నా  సరే, వారిని వదిలేసి..కేవలం ఏ 37 అని చెప్పి బాబుని అరెస్ట్ చేశారని, పైగా బాబు డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు చూపమంటే పోలీసులు విచారణ చేస్తున్నారని తప్పించుకుంటున్నారని, దీని […]

నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టి‌డి‌పి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు […]

ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]

పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు. పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే […]