వెంక‌య్యకు జ‌గ‌న్ స‌పోర్ట్ వెనుక స్టోరీ ఏంటి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీలో ఏం చేసినా సంచ‌ల‌నం గా మారింది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా స‌హా రాజ‌ధాని భూముల విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌భుత్వంపై చేసిన ఆరోప‌ణ‌లు అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ అనేక సార్లు ఉద్య‌మాల‌కు పిలుపు కూడా ఇచ్చారు. బాబు త‌న మంత్రుల‌ను రాజీనామా చేయించాల‌ని, ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని అనేక సంద‌ర్భాల్లో కేంద్రంలోపై కాలురువ్వారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జ‌గ‌న్ ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా […]

ఏపీ బీజేపీలో వెంక‌య్య స్థాయి నేత లేన‌ట్టేనా?

ఏపీ బీజేపీలో ఇప్పుడు అంద‌రూ ఈ విష‌యంపైనే  చ‌ర్చించుకుంటున్నారు.  బీజేపీకి పెద్ద‌త‌ల‌కాయ మాదిరిగా ఉంటున్న వెంక‌య్య‌నాయుడును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ , బీజేపీ సార‌ధి అమిత్ షాల ధ్వ‌యం ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డంతో వెంక‌య్య ఇక ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెట్టే ప‌రిస్థితి పూర్తిగా లేన‌ట్టే. అయితే, 2019 నాటికి ఏపీలో స్ట్రాంగ్ అవ్వాల‌ని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి వెంక‌య్య లేని లోటు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించ‌డం ఖాయం.  ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఈ […]

సైకిల్ గుర్తు వ‌ద్దు.. క‌మ‌లంపై పోటీ చేస్తాం

బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింత‌గా ఉంది. ఒక‌చోట టీడీపీ బ‌లంగా ఉంటే.. మ‌రోచోట బీజేపీ బ‌లాన్ని పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాట‌ప‌డుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. క‌ల‌హాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం వింతైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టీటీడీపీ నాయ‌కులు స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌. పార్టీని విలీనం చేయ‌కుండానే.. బీజేపీ జెండాతో […]

ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎక్క‌డ లేని జోష్ ఇచ్చింది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిప‌డిన బీజేపీ ఇప్పుడు ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్ర‌యోగించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నార‌ట‌. […]

వెంక‌య్య గూట్లోకి జంప్ అయిన మంత్రి

రాజ‌కీయాల్లో.. ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో అని కూనిరాగాలు తీస్తున్నార‌ట బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు! ఇప్పుడు ఈయ‌న‌కు అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌ద్దాం. సోము పెంచి పోషించిన నేత‌, ఆయ‌న‌కు అనుచ‌రుడిగా చెప్పుకొని డెవ‌ల‌ప్ అయిన నేత మాణిక్యాల‌రావు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మాణిక్యాల‌రావు దేవాదాయ మంత్రిగా ఉన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న న‌డిచొచ్చిన దారినే మరిచిపోయార‌ని అంటున్నారు సోము వీర్రాజు! […]

ప‌వ‌న్ మూడో స‌భ‌లో ఆయ‌నే టార్గెట్‌..!

జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత బ‌హిరంగ స‌భ‌పై ప్ర‌జ‌ల్లో ఆశ‌లు పెరిగాయి. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌న పోరు సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ సారి ఎవ‌రిని టార్గెట్‌గా చేసుకుంటారో? ఎవ‌రిమీద పంచ్‌లు విసురుతారో? అని స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు, లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు. వ‌ప‌న్ నిర్వ‌హించే స‌భ‌ల‌కు ఓ ప్ర‌త్యేకత కూడా […]

ఎలా ఎస్కేప్ అవ్వాలో వెంక‌య్య‌కే బాగా తెలుసు

గంపెడు రాజ‌కీయ‌ చ‌తుర‌త‌, గుప్పెడు వ్యూహం క‌ల‌గ‌లిసిన పొలిటిక‌ల్ నేత ఎవ‌రైనా ఉన్నారంటే ఆయ‌న అచ్చంగా వెంక‌య్య‌నాయుడే! ఏపీకి చెందిన క‌మ‌లం పార్టీ ప్ర‌ధాన నేత అయిన ఈయ‌న.. విద్యార్థి ద‌శ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. అందుకే అపార రాజ‌కీయ అనుభ‌వంతో పాటు ఏ ఎండ‌కాగొడుగు ప‌ట్ట‌డం ఈయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దంటారు! తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఎందుకు ఇవ్వ‌లేదో?  దీనికి వెనుక ఏయే కార‌ణాలు ఉన్నాయో తెలియ‌జెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న క‌మ‌ల ద‌ళం.. ఆ దిశ‌గా […]

వెంక‌య్య చెప్పిన శృంగారం క‌థ‌లు ఇవే

ఏంటి? ఎంతో బిజీగా క్ష‌ణం తీరిక కూడా లేకుండా ఉండే కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు శృంగారం గురించి మాట్లాడ‌డం ఏంట‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారా? అంతొద్దు! ఆయ‌న నిజంగానే శృంగారం గురించి పెద్ద ఎత్తున లెక్చ‌ర్ దంచేశారు! అయితే, అది ఏ బ‌హిరంగ స‌భ‌లోనో, ఎన్నికల ప్ర‌చార ర్యాలీలోనోకాదు. రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఇండీవుడ్ ఫిలిం ఫంక్ష‌న్‌లో! రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల […]

ఏపీలో వెన్నుపోటు బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో తెలుసా..

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉర‌ఫ్ రోజ‌మ్మ‌.. మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఫైరైపోయారు. ప‌నిలోప‌నిగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఇవ్వ‌క‌పోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నార‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వ‌చ్చిన త‌ర్వాత నుంచి వెంక‌య్య‌ను కూడా అప్పుడ‌ప్పుడు టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే,  తాజాగా మాత్రం మ‌రింతగా ఇద్ద‌రిపైనా […]