బాలీవుడ్‌లో హాట్ హాట్ అందాల ఆరబోతతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ మల్లికా షెరావత్, ఒక దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ జనాలను తన అందచందాలతో ఉర్రూతలూగించింది. ముఖ్యంగా అప్పట్లో వచ్చిన మర్డర్ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఘాటైన లిప్‌లాక్‌లతో అమ్మడు రచ్చ లేపడంతో అప్పట్లో ఎలాంటి ఫైర్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక కాలక్రమంలో సినిమా ఛాన్సులు తగ్గడంతో ఆమె కేవలం సెలెక్టివ్‌గా సినిమాలు […]
Tag: tollywood news
పెళ్లి పీటలెక్కబోతున్న కంగనా..త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. మరోవైపు మంచి నటిగా, దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. హీరోయన్‌గా తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగనా.. ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ […]
తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]
నిశ్చితార్ధం తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ అఖిల్ గురించి పరిచయాలు అవసరం లేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా వరసగా మూడు సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్.. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో హిట్ ట్రాక్ ఎక్కేశారు. ప్రస్తుతం ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సినిమా చేస్తున్నారు. ఇక అఖిల్ పర్సనల్ విషయాలు వస్తే.. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయణం నడిపించిన ఈయన […]
నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజలి!
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో పాపులర్ అయిన అంజలి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `షాపింగ్‌మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇక ఇటీవల వకీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న అంజలి.. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబోలో […]
గ్రాండ్‌గా ప్రారంభమైన `భోళా శంకర్`..షాకిచ్చిన కీర్తి సురేష్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో `భోళా శంకర్` అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్, హీరోయిన్‌గా తమన్నా నటించబోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండగా.. నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, […]
బిగ్‌బాస్ 5: ప్రియాంకకు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదంటున్న హిజ్రా ఫౌండర్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్ కోటాలో పాల్గొన్న ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఓవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా ఆడుతున్న ఈ బ్యూటీ.. మరోవైపు మానస్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న ప్రియాంక ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి […]
ఆ నటుడి కెరీర్‌ను నాశనం చేసిన రాజమౌళి..అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి పరోక్షంగా ఓ నటుడి సినీ కెరీర్‌ను దారుణంగా నాశనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం `మర్యాద రామన్న`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భయంకరమైన రోల్ పోషించిన నటుడు నాగినీడు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్‌ను దక్కించుకున్నాడు కానీ.. ఆ తర్వాత ఆఫర్లు […]
బాలయ్యతోనే పూనకాలు స్టార్ట్!
కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమా థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నా, ఇంకా పూర్తిస్థాయిలో ఆడియెన్స్ మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు వరుసగా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే పనిలో పడుతున్నారు. ఈ […]









