బిగ్‌బాస్ 5: ప్రియాంక‌కు స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేదంటున్న హిజ్రా ఫౌండర్‌!

November 11, 2021 at 9:15 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ట్రాన్స్‌జెండర్ కోటాలో పాల్గొన్న ప్రియాంక సింగ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా ఆడుతున్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు మాన‌స్‌తో ల‌వ్ ట్రాక్ న‌డుపుతూ ఓ రేంజ్‌లో హైలైట్‌ అయింది.

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్ చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న ప్రియాంక ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్‌ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న చంద్ర‌ముఖి.. బిగ్‌బాస్‌ షోలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు.

Telangana: Transgender candidate Chandramukhi Muvvala says she is not withdrawing from polls

అయితే ప్రియాంక‌ గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే తెలుసు, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్‌ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్‌ ఉండేది. లేదు కాబట్టి సపోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని చంద్ర‌ముఖి చెప్పుకొచ్చింది. దాంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

 

బిగ్‌బాస్ 5: ప్రియాంక‌కు స‌పోర్ట్ చేసే ప్ర‌స‌క్తే లేదంటున్న హిజ్రా ఫౌండర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts