మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో `భోళా శంకర్` అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్, హీరోయిన్‌గా తమన్నా నటించబోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండగా.. నేడు లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి బెస్ట్ విసెష్ తెలిపారు.
అలాగే పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్ కొట్టారు. అయితే ఈ పూజా కార్యక్రమంలో హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతలతో సహా అందరూ పాల్గొన్నారు.. కానీ, సినిమాలో కీ రోల్ పోషిస్తున్న కీర్తి సరేష్ మాత్రం డుమ్మా కొట్టి షాకిచ్చింది. దీంతో కీర్తి ఎందుకు రాలేదా అని ఆరా తీయగా.. ఆమె ప్రస్తుతం సర్కారు వారి పాటి షూటింగ్‌లో బిజీగా ఉందని తెలుస్తోంది.