శివ కార్తికేయ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్..!

November 11, 2021 at 10:12 am

వరుణ్ డాక్టర్ సినిమా తో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్. తన తాజా చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. ఆ సినిమా పేరే డాన్. ఈ సినిమాకి డైరెక్టర్ సి.బి.చక్రవర్తి వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకు డాన్ అనే టైటిల్ పెట్టామని డైరెక్టర్ తెలియజేశాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇదివరకే వరుణ్ డాక్టర్ సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఇదివరకు హిట్ కాంబినేషన్ కావడంతో ఈమెను మళ్ళీ రిపీట్ చేస్తున్నారు హీరో శివ కార్తికేయన్.

ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో కూడా ఈ హీరోకు మార్కెటింగ్ వరుణ్ డాక్టర్ సినిమాతో కాస్త పెరిగింది అని చెప్పుకోవచ్చు. అందుచేతనే ఈ డాన్ సినిమా కూడా తెలుగులో చేసి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 శివ కార్తికేయ న్యూ మూవీ పోస్టర్ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts