నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజ‌లి!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో పాపుల‌ర్ అయిన అంజ‌లి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `షాపింగ్‌మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైంది.

 Anjali: షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. హోమ్లీ పాత్రలతో సౌందర్య లేని లోటు తీర్చింది. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. Photo : Instagram

ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న అంజ‌లి.. ప్ర‌స్తుతం శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అంజ‌లి త‌న మ‌న‌స్సు గెలుచుకున్న‌ వ్య‌క్తి ఎవ‌రు అనే సీక్రెట్‌ను సోష‌ల్ మీడియా ద్వారా రివిల్ చేసింది.

 అది అలా ఉంటే అంజలి తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. నా మనస్సును గెలిచిన వాడు ఇతడే.. అతడికి రెండు సంవత్సరాలు.. ఈరోజు తన పుట్టినరోజు అంటూ ఫోటోస్ పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అంజలి హీరోయిన్’గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. Photo : Instagram

`నా మనస్సును గెలిచిన వాడు ఇతడే.. అతడికి రెండు సంవత్సరాలు.. ఈరోజు తన పుట్టినరోజు` అంటూ త‌న పెంపుడు శున‌కంతో దిగిన‌ ఫోటోల‌ను పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె షేర్ చేసిన‌ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CWGaSBavPFE/?utm_source=ig_web_copy_link