జగపతిబాబు అలా అన్న వారానికే నా కొడుకు పోయాడు..కోటా ఆవేద‌న‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విలక్షణ నటుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న‌ కోట శ్రీనివాస్ రావు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెండితెర‌పై విలన్‏గా ముచ్చెమటలు ప‌ట్టించ‌డ‌మే కాదు.. హాస్యనటుడిగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన కోటా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న‌యుడు ఆంజనేయ ప్రసాద్‌ హ‌ఠాన్మ‌ర‌ణం కోటా శ్రీ‌నివాస్ రావును తీవ్రంగా క‌ల‌చి వేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా.. కొడుకు మ‌ర‌ణాన్ని మ‌రోసారి త‌ల‌చుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]

శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తా.. ముందుకొచ్చిన సోనూసూద్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన పెద్ద కుమారుడికి కూడా పాజిటివ్ తేలడంతో ఆయన కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని.. ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని శివ శంకర్ మాస్టర్ చిన్నకొడుకు విజ్ఞప్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. శివ శంకర్ మాస్టర్ […]

సినిమాలు మానేసింది అందుకే..భ‌ర్త గుట్టు ర‌ట్టు చేసిన నిహారిక‌!

మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఏకైక హీరోయిన్‌, నాగాబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా నట‌న ప‌రంగా మంచి మార్కుల‌నే వేయించుకుంది. ఇక ఈ భామ గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా […]

అత్యంత విషమంగా శివ శంకర్ మాస్టర్ ఆరోగ్యం.. ఆయన కుమారుడు కూడా అపస్మారక స్థితిలోనే..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. శివ శంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు 75% ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు. శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన భార్య, పెద్ద కుమారుడు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన పెద్ద […]

డ్యాన్స్ ఇర‌గ‌దీసిన మ‌హేష్ కూతురు..ఇంట‌ర్నెట్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌ ఫొటోషూట్స్‌, డ్యాన్స్‌ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సితార‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో 475 వేల మంది ఫాలోవర్ల‌ను క‌లిగి ఉన్న సితార‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫాస్ట్ […]

న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేయ‌డంతో కోట్లు న‌ష్ణ‌పోయిన నాగార్జున‌!?

సాధార‌ణంగా సినీ న‌టులు సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొంద‌రు ఫ్లాట్స్‌ను కొంటారు. మ‌రికొంద‌రు భూముల‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డ‌బ్బుతో ఎన్నో ఆస్తుల‌ను కొనుగోలు చేశారు. భూముల‌పై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే స‌మ‌యంలో నాగార్జునను న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తనకు […]

ఈ టాలీవుడ్ హీరోల‌ను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!

సినీ ప‌ర‌శ్ర‌మ‌లో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. సినిమా హిట్టై త‌మ పాత్ర‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించిందంటే చాలు.. ఇక ఆ న‌టుల జాత‌క‌మే మారిపోతుంది. అలాగే మ‌న టాలీవుడ్‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉత్త హీరోలుగా ఉన్న కొంద‌రు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మ‌రి ఆ హీరోలు ఎవ‌రు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్‍: ద‌గ్గుబాటి వంటి బ‌డా ఫ్యామిలీ […]

`చంద‌మామ‌`తో అల‌రించిన‌ సింధు మీనన్ ఇప్పుడెక్క‌డుందో తెలుసా?

సింధు మీనన్.. ఈమె గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మళయాలీ కుటుంబంలో జ‌న్మించిన సింధు మీన‌న్‌.. 13 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే సినీ గ‌డ‌ప తొక్కింది. క‌న్న‌డ‌లో `ప్రేమ ప్రేమ ప్రేమ` చిత్రంతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన సింధు మీన‌న్‌.. `భద్రాచలం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం `చంద‌మామ‌`లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటుగా అల్ల‌రి చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందీ బ్యూటీ. ఈ […]