ఈ టాలీవుడ్ హీరోల‌ను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!

November 25, 2021 at 9:18 am

సినీ ప‌ర‌శ్ర‌మ‌లో అదృష్టం ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌స్తుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. సినిమా హిట్టై త‌మ పాత్ర‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించిందంటే చాలు.. ఇక ఆ న‌టుల జాత‌క‌మే మారిపోతుంది. అలాగే మ‌న టాలీవుడ్‌లో అప్ప‌టి వ‌ర‌కు ఉత్త హీరోలుగా ఉన్న కొంద‌రు ఒక్క సినిమాతో స్టార్ హీరోలుగా మారారు. మ‌రి ఆ హీరోలు ఎవ‌రు..? వారిని స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఏవి..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Venkatesh: కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్న సీనియర్ హీరో.. సమ్మర్ లో ఏకంగా  మూడు సినిమాలతో... | Venkatesh upcoming movies updates | TV9 Telugu

వెంకటేష్‍: ద‌గ్గుబాటి వంటి బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌టేష్‌.. `కలియుగ పాండవులు` చిత్రంతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమా చేసిన‌ప్ప‌టికీ.. వెంకీని స్టార్ హీరోల చెంత చేర్చిన సిమిమా మాత్రం `బొబ్బిలి రాజా`. బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో వెంకటేష్‌కు స్టార్‌డమ్ తీసుకొచ్చింది.

Nagarjuna : నాగార్జున వాటిని లెక్క చేయకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు..?  | News Orbit

నాగార్జున: `విక్రం` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన నాగార్జున‌.. రాంగోపాల్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `శివ‌` సినిమాతో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

Nandamuri Bala Krishna: కరోనా బాధితులకు అండగా బాలకృష్ణ... ఈ నంబర్లకు ఫోన్  చేస్తే చాలు క్షణాల్లో సాయం..

బాలకృష్ణ: `తాతమ్మకల` చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన బాల‌య్య‌.. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాలు చేస్తారు. కానీ, ఈయ‌న సినీ కెరీర్‍ను ఓ స్థాయికి తీసుకెళ్లిన సినిమా `మంగమ్మ గారి మనువడు`.

Jr NTR talks to fan battling life in hospital, actor's kind gesture goes  viral - Movies News

జూనియర్‍ ఎన్టీఆర్‍: నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌ను స్టార్‌గా మార్చిన చిత్రం `ఆది`. వీవీ వినాయక్ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీ 2001లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టైంది.

41YrsOfSSMBMasteryInTFI : Mahesh Babu's fans celebrate his long career |  Telugu Movie News - Times of India

మహేష్ బాబు: రాజకుమారుడు సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్‌.. `మురారి` సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ, ఆయ‌న్ను టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ ఒక్క‌టిగా నిల‌బెట్టిన చిత్రం `ఒక్క‌డు`.

Rebel Star Prabhas to get married in 2020? Here is what his aunt Shyamala  Devi has to say | Telugu Movie News - Times of India

ప్రభాస్: ఈశ్వర్ సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ చేసిన ప్ర‌భాస్ కెరీర్‍కు మాంచి బూస్ట్ ఇచ్చిన సినిమా `వ‌ర్షం`. ఈ సినిమాతో ప్ర‌భాస్ స్టార్‌గా మార‌డ‌మే కాదు.. యూత్‌కి బాగా ద‌గ్గ‌రైయ్యాడు కూడా. ఇక ర‌వితేజ‌ను ఇడియట్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తొలి ప్రేమ‌, అల్లు అర్జున్‌ను ఆర్య‌, రామ్ చ‌ర‌ణ్‌ను మ‌గ‌ధీర, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అర్జున్ రెడ్డి చిత్రాలు స్టార్ హీరోలుగా మార్చాయి.

ఈ టాలీవుడ్ హీరోల‌ను స్టార్ హీరోలుగా మార్చిన చిత్రాలు ఇవే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts