న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేయ‌డంతో కోట్లు న‌ష్ణ‌పోయిన నాగార్జున‌!?

సాధార‌ణంగా సినీ న‌టులు సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొంద‌రు ఫ్లాట్స్‌ను కొంటారు. మ‌రికొంద‌రు భూముల‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డ‌బ్బుతో ఎన్నో ఆస్తుల‌ను కొనుగోలు చేశారు.

Nagarjuna looking to work with web series

భూముల‌పై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే స‌మ‌యంలో నాగార్జునను న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తనకు సమీప బంధువు అయిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా నాగార్జున గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీప ప్రాంతంలో ఒక భూమిని కొనుగోలు చేశారు.

Nagarjuna's next film 'Praveen Sattaru' in action mode- The New Indian Express

అయితే ఆ భూమి విష‌యంలో కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. నాగ్ ఎంత‌గానో నమ్మిన స‌ద‌రు రియ‌ల్‌ ఎస్టేట్ వ్యాపారే.. ఆయ‌న్ను దారుణంగా మోసం చేశాడ‌ట‌. దాంతో నాగార్జున కోట్ల రూపాయిల‌ను న‌ష్ట‌పోయాడ‌ని గ‌తంలో పెద్ద ఎత్తున క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక నాగార్జున ఒక్క‌డే కాదు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో న‌టులు కేటుగాళ్ల‌ బారిన పడి కోట్లలో ఆస్తిని పోగొట్టుకున్నారు.

Nagarjuna Akkineni Ends The Wait

కాగా, నాగార్జున సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్నాడు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.