నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. `వీర సింహారెడ్డి` అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు. `ఎన్బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే […]
Tag: telugu movies
పోలీసుల `కస్టడీ`లో నాగచైతన్య.. పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `మానడు` ఫ్రేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు 22వ ప్రాజెక్టు ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ […]
ఒక్క హిట్ తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నిర్మాతలకి చుక్కలే!?
ఒక్క హిట్టు పడిందంటే చాలు హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా పచ్చి చేరిందని అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్గా సత్తా చాటిన త్రిష.. ఇటీవల కెరీర్ పరంగా బాగా వెనుకబడింది. ఆఫర్లు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గు చూపింది. అయితే ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవి విజయం […]
చరణ్ కోసం ఎన్టీఆర్ భారీ త్యాగం.. ఇది అసలైన స్నేహమంటే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో వీరి స్నేహబంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడు చరణ్ కోసం ఎన్టీఆర్ రీసెంట్ గా ఓ భారీ త్యాగం చేశాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తన 16 చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేశాడు. […]
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇలాగైనా సంతోషించండి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `యశోద`.. స్ట్రీమింగ్ డేట్ లాక్?!
హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో సమంత టైటిల్ పాత్రను పోషించిన చిత్రం `యశోద`. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణ ప్రసాద నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రను పోషించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్ ను అందుకుంది. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ […]
రూ. 100 కోట్లు నష్టపోయిన వెంకీ.. అనవసరంగా తొందర పడ్డాడా?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తొందరపాటు కారణంగా రూ.100 కోట్లు నష్టపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళం లో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. అనూహ్యంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత దృశ్యం కు సీక్వెల్ గా […]
పవన్ తప్ప మరో హీరో దొరకలేదా..? ఆ డైరెక్టర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్!?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శర్వానంద తో `రన్ రాజా రన్` సినిమాను తెరకెక్కించి దర్శకుడుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుజిత్.. తన రెండో సినిమాను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసే అవకాశాన్ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `సాహో`. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం 2019లో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో […]
ముగ్గురు హీరోలతో `హిట్ 3`.. నాని మాస్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు!
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. నాని […]









