ఒక్క హిట్టు పడిందంటే చాలు హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా పచ్చి చేరిందని అంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్గా సత్తా చాటిన త్రిష.. ఇటీవల కెరీర్ పరంగా బాగా వెనుకబడింది. ఆఫర్లు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ కథల వైపు మొగ్గు చూపింది.
అయితే ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలేవి విజయం సాధించలేదు. ఇక కెరీర్ డేంజర్ జోన్ లో పడిన సమయంలో ఈ అమ్మడికి `పొన్నియన్ సెల్వన్` చిత్రంలో అవకాశం వచ్చింది. భారీ తారగణంతో మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘ విజయం సాధించింది. ఇందులో త్రిష పోషించిన కుందువై పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
విమర్శకుల సైతం కొందువై పాత్రలో మెరిసిన త్రిషపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతో త్రిషకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. దీంతో త్రిష తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేస్తుందట. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలకు కలిపి రెండు కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న త్రిష.. ఇటీవల ఓ కోలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఏకంగా రూ. 3 కోట్ల డిమాండ్ చేసిందట. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని త్రిష చెప్పిందట. ఇక సదరు సినిమా మేకర్స్ చేసేదేమి లేక ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారట. ఏదేమైనా త్రిష ఈ రేంజ్ లో పారితోషికాన్ని డిమాండ్ చేస్తే ముందు ముందు నిర్మాతలకి చుక్కలే అని అంటున్నారు.