మరోసారి రాప్తాడు రాజకీయం రాష్ట్ర స్థాయిలో హైలైట్ అవుతుంది..గత టీడీపీ హయాంలో అక్కడకు వచ్చిన జాకీ పరిశ్రమని..కమీషన్లు అడిగి వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన అనుచరులు భయపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయేలా చేశారని చేసి మాజీ మంత్రి సునీతమ్మ, శ్రీరామ్‌లు ఆరోపించారు. భూములని కొల్లగొట్టడానికే సునీతమ్మ జాకీ సంస్థ పేరుతో డ్రామాలు ఆడారని ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు.
ఈ విమర్శలు తర్వాత ఈనాడు పత్రికలో జాకీ పరిశ్రమ తరలిపోవడంపై మొదట పేజీలో కథనం వచ్చింది. టీడీపీ హయాంలో జాకీ సంస్థ..రాప్తాడులో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిందని, ప్రభుత్వం భూములు కూడా కేటాయించిందని, 2019 ఎన్నికల నాటికి ప్రహరీ గోడల నిర్మాణం కూడా అయిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక..వైసీపీ నేతలు కమీషన్లు అడుగుతుండటంతో..అది తట్టుకోలేక జాకీ సంస్థ పక్కనే ఉన్న తెలంగాణకు వెళ్లిపోయిందని కథనం ఇచ్చింది. దీనికి పూర్తి స్థాయిలో ప్రకాష్ రెడ్డి కౌంటర్ ఇవ్వలేని పరిస్తితి.
కేవలం ఈ అంశం గురించే కాదు..రాప్తాడులో సునీతమ్మ పాదయాత్ర చేస్తూ..ప్రకాష్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో గెలుపెవరిదో చూసుకుందామా? అంటూ ప్రకాష్ రెడ్డికి సునీతమ్మ సవాల్ విసిరారు. ప్రకాష్ దౌర్జన్యాలు, దందాలు అన్నీ తెలుసని, 2024 ఎన్నికల్లో ఎవరు గెలుపెవరిదో తేల్చుకుందామని అన్నారు.
ఇలా సునీతమ్మ తనదైన శైలిలో ప్రకాష్‌పై ఫైర్ అవుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో రాప్తాడు బరిలో సునీతమ్మ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అటు శ్రీరామ్ ధర్మవరంలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే రాప్తాడులో ప్రకాష్ రెడ్డి కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. కాకపోతే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉంది..కానీ ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటు టీడీపీ బలపడుతుంది. ఈ పరిస్తితుల్లో రాప్తాడులో పోరు హోరాహోరీగా సాగేలా ఉంది. అయితే సునీతమ్మకు నిదానంగా ఆధిక్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో చూడాలి.