తెలుగు బుల్లితెరపై యాంకర్ గా, నటిగా మంచి పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తే పలు వివాదాలకు దారితీస్తూ ఉంటుంది అనసూయ. మొదట పలు టీవీ చానల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఈమె జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయ మంచి క్రేజ్ రావడంతో పలు సినిమాలలో పలు అవకాశాలను అందుకొని ప్రస్తుతం క్రేజీ బామ్మగా పేరుపొందుతోంది. జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పి ఇతర చానల్స్ లో యాంకర్ గా చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడు తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూ అభిమానులను ట్రీట్ చేస్తూ ఉంటుంది. అనసూయ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న కారణం చేత గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో పాల్గొనలేకపోయింది అనసూయ.
పుష్ప చిత్రంలో కూడా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. ప్రస్తుతం పుష్ప -2 సినిమాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేస్తూ కూడా ఎప్పుడు పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది .ఇటీవల విజయ్ దేవరకొండ అభిమానులు సైతం అనసూయను ట్రోల్ చేయడం జరిగింది.
అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో మేకప్ లేకుండా కనిపించింది. దీంతో ఇమే ను చూసిన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మేకప్ లేకుండా కూడా అనసూయ ఇంత అందంగా ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా గ్రీన్ కలర్ దుస్తులలో తన అంద,చందాలను చూపిస్తు కుర్రకారులకు మతి పోగొట్టేలా చేస్తోంది అనసూయ. ప్రస్తుతం అనసూయ కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.