న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. నాని సైతం ఈ సినిమా పై తనవంతు హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే హిట్ 2 విడుదల కాకుండానే హిట్ 3 కోసం నాని అడవి శేషు తో కలిసి మాస్టర్ ప్లానింగ్ చేసుకున్నాడట.
హిట్ 3కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీగా ఉందట. ఈ మూడో భాగంలో ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలు నటించబోతున్నారట. ఇంతకీ ఆ హీరోలు మరెవరో కాదు అడివి శేష్, నాని మరియు విజయ్ సేతుపతి. అంతే కాదు హిట్, హిట్ 3 తెలుగు రాష్ట్రాల్లో సాగాయి. అయితే మూడో భాగం మొత్తం అమెరికాలో ఉంటుందట. హిట్ 2 ఫలితం ఎలా ఉన్నా సరే 3 నీ తీయాలని నాని మరియు అడివి శేష్లు భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని ప్రచారం జరుగుతోంది.