పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రమిది. ఇందులో అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టీ త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రం 2000 వ సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైంది.
అయితే తొలి రోజు ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండవ రోజుకి అది పాజిటివ్ గా మారింది. ఇక మూడో రోజు నుండి పికప్ అయ్యి ఏకంగా 200 రోజులు ఆడింది. అయితే మళ్లీ ఇన్నేళ్ళకు ఈ సినిమాను 4కె క్వాలిటీతో రీ రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట. వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల ఉంటుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పవన్ నుంచి ఎలాగో కొత్త సినిమాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.. పాత సినిమాల రీ రిలీజ్ తో అయినా సంతోషించండి అంటూ పలువురు నెటిజన్లు అభిమానులను ఉద్దేశించి సెటైర్లు పేలుస్తున్నారు.