హరి-హరీష్ ద్వయం దర్శకత్వంలో సమంత టైటిల్ పాత్రను పోషించిన చిత్రం `యశోద`. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణ ప్రసాద నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రను పోషించారు.
నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్ ను అందుకుంది. సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సమంత గర్భవతి పాత్రలో ఒదిగిపోవడమే కాదు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో విడుదలైన పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తుచిత్తు చేసి లాభాల బాట పట్టింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే యశోద విడుదలై నెల తిరక్క ముందే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతుందట. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా యశోద స్ట్రీమింగ్ డేట్ లాక్ చేశారట. డిసెంబర్ 9న యశోదను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం ఆనందని అంటున్నారు.