మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు అయిపోయిన ఇంకా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కెరీర్ పరంగా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు `జైలర్` ఒకటి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపిక అయింది. […]
Tag: telugu movies
పూజా హెగ్డేకు లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. అసలు కథ తెలిస్తే షాకైపోతారు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ విషయాలను పక్కన పెడితే.. గత రెండు రోజుల నుంచి త్రివిక్రమ్, పూజా హెగ్డేలకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. […]
నాని డైరెక్టర్ చేదు అనుభవాలు.. అనుష్క అనుకుని బట్టలు లేని ఫొటోలు పంపారట!
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గురించి పరిచయాలు అవసరం లేదు. మెంటల్ మదిలో మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన వివేక్.. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించారు. ఆ తర్వాత `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్ అందుకు తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు. మూడో ప్రయత్నంగా న్యాచురల్ స్టార్ నానితో `అంటే సుందరానికి` సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]
బిగ్ బ్రేకింగ్: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్..!?
మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొదటి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన తర్వాత మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడని గత కొద్ది నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. అయితే మనోజ్-మౌనిక గత ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయడం, పలు మార్లు జంటగా కనిపించడం వంటి అంశాలు […]
కళ్లు చెదిరే ధర పలికిన `ఏజెంట్` థియేట్రికల్ రైట్స్.. అఖిల్ ఎదుట భారీ టార్గెట్!?
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్`. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఇందులో మలయాళ స్టార్ మమ్ముటి కీలక పాత్రను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. ఇప్పటికే […]
మోసం చేసిన నాని.. గొడవకు దిగిన కీర్తి సురేష్.. ఏం జరిగిందంటే?
న్యాచురల్ స్టార్ నాని జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ను మోసం చేశాడు. దాంతో కీర్తి సురేష్ నానితో గొడవకు దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, కీర్తి సురేష్ జంటగా `దసరా` అనే మూవీ లో నటించిన సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవలె షూటింగ్ […]
ఎన్నో పోరాటాలు, మరెన్నో కష్టాలు.. వైరల్‌గా మారిన అలేఖ్యరెడ్డి షాకింగ్ పోస్ట్!
నందమూరి తారకరత్న గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన అలేఖ్య.. ‘మనం కలిసి ఉండేందుకు […]
హాలీవుడ్ సినిమాలపై చరణ్ మోజు.. అతి పెద్ద కోరిక బయటపెట్టిన మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. హెచ్.సి.ఎ. సంస్థ ఆయన్ని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన `గుడ్ మార్నింగ్ అమెరికా`లో పాల్గొనే అవకాశాన్ని చరణ్ దక్కించుకున్నారు. అలాగే వచ్చే నెల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగబోతోంది. ఈ […]
అల్లరి నరేష్ `ఉగ్రం` కథ నచ్చినా సరే ఆ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడు?
అల్లరి నరేష్ నుంచి తర్వలో `ఉగ్రం` అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. నాందితో తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడలతో అల్లరి నరేష్ చేసిన చిత్రమిది. షైన్ స్క్రీన్ బ్యానర్ గా సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్న ఈ సినిమాతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక యాంగ్రీ పోలీస్ అఫీసర్ పాత్రలో నటించారు. ఇటీవల బయటకు వచ్చిన […]









