బిగ్ బ్రేకింగ్‌: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్‌..!?

మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొద‌టి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన త‌ర్వాత మ‌నోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని గ‌త కొద్ది నెల‌ల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి.

అయితే మనోజ్-మౌనిక గ‌త ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా క‌నిపించ‌డం వంటి అంశాలు వీరి ప్రేమ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. అదే స‌మ‌యంలో మ‌నోజ్‌, మౌనిక‌ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఊహాగానాలే నిజం అయ్యేలా క‌నిపిస్తున్నాయి.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్ అయింద‌ట‌. మార్చి 3న వీరిద్దరి పెండ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ వార్త తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. కుటుంబస‌భ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కానున్నార‌ట‌. ఈ వీరి పెండ్లి వేడుక‌ మనోజ్ సోదరి మంచులక్ష్మీ ఇంట్లో జరుగుతుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఏర్ప‌ట్లు కూడా షురూ అయ్యాయ‌ని టాక్‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.