ఇండియన్ సినిమా హిస్టరీలోనే కని విని ఎరుగని రికార్డ్..చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. మెగా హీరోకి అరుదైన గౌరవం..!!

ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే . చిరుత సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ మెగా వారసుడు . ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ..టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు. అంతేకాదు తాను చేయబోయే నెక్స్ట్ సినిమా ఆర్సి 15 కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది నిజంగా మెగా హీరో సంచలన ర్కార్డ్ అని చెప్పాలి.

కాగా ఇంత గౌరవాని చరణ్ దక్కించుకోవడానికి కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పడంలో సందేహం లేదు . ఒకప్పుడు హాలీవుడ్ గడ్డపై హాలీవుడ్ స్టార్స్ పేరు చెప్తేనే అరుపులు, కేకలు వినిపించేటివి . ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్తే హాలీవుడ్ హీరోల కన్నా ఎక్కువ స్థాయిలో కేకలు అరుపులు వినిపిస్తున్నాయి. ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు చరణ్.

రణం రౌద్రం రుధిరం అనే తో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇప్పుడు హాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ పేరు చెప్తే వస్తున్న రెస్పాన్స్ ..రి సౌండ్ తెలుగు జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆ రేంజ్ లో రాంచరణ్ -తారక్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పలు సంచలన రికార్డు లు నెలకొల్పిన విషయం తెలిసిందే . ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా అందుకొని గోల్డెన్ క్లోబ్ అవార్డు అందుకోవడమే కాకుండా ..ఆస్కార్ కి నామినేట్ అయింది.

రీసెంట్ గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఏకంగా నాలుగు కేటగిరిలో అవార్డు దక్కించుకొని ఆర్ఆర్ఆర్ మరో సంచలన రికార్డును నెలకోల్పింది.హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డు ప్రజెంటర్ గా గౌరవం దక్కించుకున్నారు. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును అందజేశారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఇండియా నుంచి ఎవరు ఈ అరుదైన గౌరవం అందుకోలేదు . దీంతో మెగాస్టార్ పుత్రోత్సాహం డబల్ అయింది. ఈ క్రమంలోని రామ్ చరణ్ పేరు టృఎండ్ చేస్తున్నారు అభిమానులు..!!