ఏపి రాజకీయాలల్లో మరో సంచలనం..తారకరత్న భార్యకి కీలక పదవి..ఒక్క వికెట్ తో క్లీన్ బౌల్డ్..!?

ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ప్లాన్ బి స్ట్రాటజీలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరతీశారు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రాజకీయ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే నందమూరి తారక రామారావు గారి మనవడు ..నందమూరి తారకరత్న రీసెంట్ గానే గుండె నొప్పితో బాధపడుతూ బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మరణించారు . సుదీర్ఘంగా 23 రోజులపాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆయన ..ఇక ఆలసిపోయి తనువు చాలించాడు .

ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ , టీడీపీ శ్రేణులు , ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు . మరి ముఖ్యంగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఆపడం ఎవరి తరం కాలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భర్త విగత జీవిగా పడి ఉన్న దృశ్యాలను చూసి అలేఖ్య రెడ్డి కుమిలి కుమిలి ఏడ్చిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నాయి. అయితే ఆమెను ఆ మరణ విషాదఛాయల నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యులు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది . మరి ముఖ్యంగా నందమూరి తారకరత్న ఫ్యామిలీకి బాలకృష్ణ సపోర్ట్ పూర్తిగా లభిస్తుంది . ఇప్పటికే నందమూరి తారకరత్న పిల్లల భవిష్యత్తు – చదువులు – పెళ్లిళ్లు అంతా బాధ్యత నాది అంటూ భుజాలపై వేసుకున్న బాలకృష్ణ.. మరో బాధ్యతను తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తుంది.

భర్త చనిపోయాడు అనే బాధ నుంచి బయటపడడానికి మానసికంగా త్వరగా కోల్పోవడానికి ఆమెను ఏదో ఒక పనిలో పెట్టడానికి సిద్ధపడ్డారట . మునుపటిలా అలేఖ్య రెడ్డి ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేస్తున్నారట . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని అలేఖ్య రెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఫిక్స్ అయ్యారట. మనకు తెలిసిందే తారకరత్న ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు .ఈ క్రమంలోనే నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మొదటి రోజు పాల్గొని టిడిపి పై తనకున్న ప్రేమను మరోసారి ప్రూవ్ చేశాడు.

కాగా ఆయన కోరికను నెరవేర్చడానికి బాలకృష్ణ నందమూరి అలేఖ్య ని రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబుకు చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో ఆమెకి కీలక పదవి ఇప్పించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట బాలయ్య .ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించి భర్త చేయాలనుకున్న ప్రజాసేవను భార్య చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇది నిజంగా ఏపీ రాజకీయాలలో పెను సంచలనం అనే చెప్పాలి చూడాలి . మరి దీనిపై అలేఖ్య రెడ్డి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలోని హరికృష్ణ చనిపోయినప్పుడు కుమార్తె సుహాసినికి చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు . అదే స్టాటజీను మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది..!!