నాని డైరెక్ట‌ర్ చేదు అనుభ‌వాలు.. అనుష్క అనుకుని బట్టలు లేని ఫొటోలు పంపారట‌!

డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెంటల్ మదిలో మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన వివేక్‌.. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూపించారు. ఆ త‌ర్వాత `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్ అందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌య్యారు. మూడో ప్ర‌య‌త్నంగా న్యాచుర‌ల్ స్టార్ నానితో `అంటే సుందరానికి` సినిమాను తెర‌కెక్కించాడు.

అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు, సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వివేక్ మాట్లాడుతూ.. `కోవిడ్ టైమ్ లో నా ఫ్రెండ్ ఫాద‌ర్ కు హెల్త్‌ పాడైంది. ర‌క్తం అవ‌స‌రం కావ‌టంతో డోన‌ర్స్ కోసం చాలా వెతికాం. అలాగే నా నెంబ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి సాయం అడిగాను.

హీరోయిన్ అనుష్కకి విష‌యం తెలియ‌టంతో ఆమె కూడా నా మెసేజ్‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే చాలా మంది ఆ నెంబ‌ర్ అనుష్క‌దే అనుకుని.. నాకు కాల్స్ చేయ‌డం స్టార్ట్ చేశారు. అసభ్యంగా మెసేజ్ లు పెట్టేవారు. బట్టలు లేని ఫొటోలు పంపారు. వీడియో కాల్స్ కూడా చేశారు. హీరోయిన్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది. వెంటనే ఆ నంబర్ ని బ్లాక్ చేశాను` అంటూ చెప్పుకొచ్చాడు. వివేక్ కు ఎదురైన ఈ చేదు అనుభ‌వం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.