ఎన్నో పోరాటాలు, మ‌రెన్నో క‌ష్టాలు.. వైర‌ల్‌గా మారిన అలేఖ్యరెడ్డి షాకింగ్ పోస్ట్‌!

నందమూరి తారకరత్న గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ళ వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టేశాడు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఆయ‌న‌ సతీమణి అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ షాకింగ్ పోస్ట్ ను పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారింది.

భర్త చేతిలో చేయి వేసిన ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన అలేఖ్య.. ‘మనం కలిసి ఉండేందుకు జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాం. మ‌రెన్నో క‌ష్టాలు ప‌డ్డాం. నీ చివరి రోజుల వరకు కలిసి ఫైట్‌ చేశాం. కార్లలో నిద్రించిన రోజుల నుంచి ఇప్పటివరకు.. మన జీవిత ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేశాం. నువ్వో యోధుడివి నానా.. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేరు` అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

కాగా, తారకరత్న-అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో తండ్రి మోహన కృష్ణతో పాటు మిగతా నందమూరి కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా అలేఖ్య రెడ్డిని తారకరత్న పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. అయితే తారకరత్న దూరం కావ‌డంతో ఆయ‌న భార్య‌, పిల్ల‌లు ఒంటిరి వార‌య్యారు.

https://www.instagram.com/p/CpCxJR9qObd/?utm_source=ig_web_copy_link