భార‌త్‌లో మ‌రింత దిగ‌జారిన‌ క‌రోనా కేసులు..374 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న కూడా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత‌గా దిగ‌జారాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,093 […]

శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌..ఏం జ‌రిగిదంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భ‌ర్త‌, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో న‌మోదైన ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రానే ఉన్నాడ‌ని ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన క‌మీష‌న‌ర్‌.. కుంద్రాకు […]

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స‌త్య‌దేవ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌త్య‌దేవ‌.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల‌తో స‌త్య‌దేవ్ స‌త్తా ఏంటో అంద‌రికీ తెలిసింది. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించే వారిలో ఈయ‌నా ఒక‌రు. ఇక ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న స‌త్య‌దేవ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. […]

`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

బుల్లితెర‌పై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియ‌ల్ కార్తిక‌దీపం. ప్రేక్ష‌కుల‌కు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీక‌దీపంను బీట్ చేయ‌డం ఈ సీరియ‌ల్ త‌రం కావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియ‌ల్ ముందు త‌ల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కు ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే తాజాగా డాక్ట‌ర్ బాబు సంపాద‌న‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. డాక్ట‌ర్ […]

న‌న్ను ఫ‌స్ట్ హ‌గ్ చేసుకున్న‌ది అనుష్క‌నే అంటున్న యంగ్ డైరెక్ట‌ర్!

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ! అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొద‌టి సినిమాతోనే త‌న మార్క్‌ను చూపించారు. ఆ త‌ర్వాత ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన‌ కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. ప్ర‌స్తుతం ఈయ‌న తేజ స‌జ్జాతో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్న `మీకు మాత్రమే […]

ఈ సారి విజయ్‌ దేవరకొండను టార్గెట్ చేసిన వ‌ర్మ‌..ట్వీట్ వైర‌ల్‌!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలియ‌ని వారుండ‌రు. ఒక‌ప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు తీసి వార్త‌ల్లో నిలిచిన ఈయ‌న‌.. ఇప్పుడు మాత్రం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌లు నిలుస్తున్నారు. ఇక తాజాగా వ‌ర్మ టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేశాడు. అయితే ఈ సారి విమ‌ర్శ‌లు కాకుండా.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ విజ‌య్‌పై ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. ఇంత‌కీ ఏమ‌ని ట్వీట్ చేశాడంటే.. `లైగర్‌ సినిమాలో విజయ్‌ […]

పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది. ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ […]

ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..కార‌ణం అదేనా?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు భారీగా క్షీణించ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్

కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్‌, బీజేపీలను  రేవంత్‌ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్‌ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్‌ పాలిటిక్స్‌ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డవలప్‌మెంట్‌ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ […]