న‌న్ను ఫ‌స్ట్ హ‌గ్ చేసుకున్న‌ది అనుష్క‌నే అంటున్న యంగ్ డైరెక్ట‌ర్!

July 20, 2021 at 8:51 am

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ! అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొద‌టి సినిమాతోనే త‌న మార్క్‌ను చూపించారు. ఆ త‌ర్వాత ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన‌ కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి.

Prashanth Varma may make a film on coronavirus pandemic: reports -  Hindustan Times

ప్ర‌స్తుతం ఈయ‌న తేజ స‌జ్జాతో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్న `మీకు మాత్రమే చెప్తా` అనే షో లో పాల్గొన్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మొద‌టి చిత్రం అ! ప్రివ్యూ షో స‌మ‌యంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌ను కూడా వివ‌రించారు. `అ! ప్రివ్యూ చూస్తున్నప్పుడు టైటిల్స్ పడటానికి ముందు సినిమా కొంచెం స్టార్ట్ అవుతుంది.

Director Prasanth Varma confirms sequel to his movie 'Awe' | The News Minute

ఆ సీన్స్‌ చూడగానే స్టార్ హీరోయిన్ అనుష్క తన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. మళ్లీ సినిమా పూర్తయ్యాక తన దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చి హ‌గ్ చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో నా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. తనను హగ్ చేసుకున్న మొదటి అమ్మాయి అనుష్క‌నే. అప్పుడు తనకు సినిమా హిట్ అనే నమ్మకం వచ్చేసింది` అని చెప్పుకొచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

న‌న్ను ఫ‌స్ట్ హ‌గ్ చేసుకున్న‌ది అనుష్క‌నే అంటున్న యంగ్ డైరెక్ట‌ర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts