“RRR” నటునితో దిల్ రాజు సినిమా…?

బాలీవుడ్ క్వీన్, 90వ దశకంలో కుర్రకారు నిద్రను చెడగొట్టిన అందాల భామ కాజోల్ భర్త అజయ్ దేవ్ గన్ సినీ ప్రియులకు సుపరిచితుడు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరైన దిల్ రాజు అజయ్ దేవ్ గన్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. మొదటి సినిమా పేరుతోనే పిలవబడుతున్న ఈ హీరోకు గత కొన్నేళ్లుగా సరైన హిట్లు […]

ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ఇటీవ‌ల చెక్, రంగ్ దే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత‌ చైతన్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ మ‌రో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన […]

దర్శకురాలిపై కేసు..?

ఇప్పుడు రాజ‌ద్రోహం కేసులు అనేవి వరుస‌గా వినిపిస్తున్న పేర్లు. ఒక వైపు సుప్రీంకోర్టులో దీనిపై దర్యాప్తు జ‌రుగుతుండ‌గానే మరో దిక్కు లక్షద్వీప్ పోలీసులు సినీ నటిపై రాజ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు. లక్షద్వీప్‌‌నకు చెందిన సినీ నిర్మాత క‌మ్ డైరెక్ట‌ర్ అయిన ఆయిషా సుల్తానాపై స్థానిక పోలీసులు దేశద్రోహం కేసు ఫైల్ చేశార‌ని తెలుస్తోంది. స్థానిక బీజేపీ అధ్యక్షుడు అయిన సి. అబ్దుల్ ఖాదిర్ అయిషా సుల్తానాపై చేసిన ఫిర్యాదు ప్ర‌కారం పోలీసులు ఈ కేసు న‌మోదు […]

దీవెనలంటే అర్థమిది: పూరి

పూరి జ‌గ‌న్నాథ్ అంటే ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న సినిమాల ద్వారానే కాదు బ‌య‌ట కూడా బాగా పాపుల‌ర్‌. ఆయ‌న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మాట్లాడా మాట‌లు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేస్తాయి. ఇప్ప‌టికే ఎన్నో విష‌యాల‌పై చాలా ఓపెన్‌గా మాట్లాడా పూరి. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈసారి మ‌నుషుల‌కు చేసే సాయంపై ఆయ‌న మాట్లాడారు. సాయం చేయ‌డానికి మించిన దీవెన మరొకటి లేదని చెప్పారు. ఎంత‌సేపు దేవుడి దీవెన‌ల‌తోనే ప‌నులు కావ‌ని, […]

హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి..?

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచమంతటా మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమెడియన్ ఆలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజమౌళి కోసం తాను ఓ కథ రాశానని, ఆ సినిమాను హాలీవుడ్‌ లో నిర్మించబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ సినిమా లైవ్ యానిమేషన్ సినిమాగా భారీ బడ్జెట్ […]

డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు నూతనంగా వైవిధ్యమయిన చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ..’ అనే థ్రిల్లర్ చిత్రం ఇంకా ‘ కల్కి ‘ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి చిత్రంతో సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారిగా జాంబీ జోనర్ ను తీసుకొచ్చి అందరిని […]

ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ తేదీ ఖరారు..!

కరోనాతో థియేటర్లతో పాటు షూటింగ్‌లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే బాట పడుతున్నారు. తాజాగా అక్కినేని సమంతా తొలిసారి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయింది. కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి సీక్వెల్ గా ఈ వెబ్ సిరీస్ రానుంది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ పోషించారు. దీనిని దర్శకులు రాజ్‌ నిడిమోరు, […]

ఎఫ్ 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగ‌స్ట్ 27న ఈ మూవీని […]