త్రివిక్రమ్ చేతులు మీదగా సిద్ధూ న్యూ సినిమా..?

మన తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒక‌టైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మ‌రో కీల‌క రోల్‌లో చేస్తున్నారు.

ఈ మూవీతోనే శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ డైరెక్ట‌ర్ గా పరిచయం అవుతున్నాడ‌ని తెలుస్తోంది. కాగా ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ప్రేమలోని పలు సున్నితమైన అంశాల‌ను తీసుకుని రమేష్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మ‌చారం. ఈరోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కాస్త ఆగస్టులో ప్రారంభమవుతుంద‌ని తెలుస్తోంది. ఈ మూవీలోని ఇత‌ర పాత్రల్లో నటీ నటులుగా ఎవ‌రు చేస్తార‌నేది త్వరలో ప్రకటించనున్నారు.

Share post:

Latest