హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగి వచ్చిన వేళ..

August 2, 2021 at 2:58 pm

ఇటీవల సినీ ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా సక్సెస్ ను అందుకుంది అంటే, ఆ సినిమాను ఇతర భాషల్లో అనువదించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సినిమాలు రీమేక్ చేయబడుతున్నాయి.ఇకపోతే ఒక క్రియేటివ్ డైరెక్టర్ మాత్రం కొత్తగా ఆలోచించి మన నేటివిటీకి సరి కొత్తగా అందరికీ అర్థమయ్యే విధంగా , ఒక హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులోకి అనువదించడానికి సిద్ధమవుతున్నారు.

ఇలా ఎందుకు అంటే, ముఖ్యంగా మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ప్రేక్షకులకు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు విభిన్న కథలతో వచ్చే సినిమాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే ఆ హాలీవుడ్ చిత్రాన్ని మన ప్రేక్షకుల ఆలోచనలకు దగ్గరగా చేసి, కొన్ని మార్పులు చేసి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మన క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటికే ఈ హాలీవుడ్ సినిమా కథను, మన సంప్రదాయానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి, ఒక నిర్మాత కు కూడా వినిపించడం జరిగింది. ఇక ఆయన కూడా ఓకే అనడం కూడా అయిపోయింది. కాబట్టి త్వరలోనే ఈ సినిమా కథకు సరితూగే ఒక పవర్ఫుల్ హీరో ని తీసుకోవాలని చర్చలు కూడా జరుగుతున్నాయట.

ఆ హీరోల లిస్టులో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నట్లు సమాచారం..ఇక వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారు అన్నది వేచి చూడాలి. అంతేకాదు మల్టీస్టారర్ మూవీ గా ఈ కథను రూపొందించాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే చూడాలి మరి ఎవరు హాలీవుడ్ రేంజ్ ను అందుకుంటారో.

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు దిగి వచ్చిన వేళ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts