లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి

పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది. లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ […]

రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?

ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్‌ గాంధీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు […]

టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]

త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?

తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ […]

స్వామి ‘రామాయణం’లో నిజమెంత?

సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్‌గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ […]

ఈ వ్యభిచారమేటి రెడ్డిగారూ?

పార్టీ ఫిరాయింపుని రాజకీయ వ్యభిచారం అని సంబోదిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే అదిప్పుడు రాజకీయాల్లో సాధారణ విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పరిపాలన పక్కన పెట్టి మరీ పాలకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో జరిగినప్పటికీ రాజకీయ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత జుగుప్సాకరంగా ఇంతకు ముందెన్నడూ పార్టీ ఫిరాయింపులు జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించినవారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకరు. ఆయన కూడా […]

కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్‌ జమానా!!

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్‌, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత […]

తెరాస ని డీ కొట్టే సత్తా డీకే అరుణకుందా!!

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుండి కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిద్యం వహిస్తూ కాంగ్రెస్ లో మహా మహా రాజకీయ కురువ్రుద్దులకే కెసిఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక తెరాస కి దాసోహం అవుతుంటే ఒక్క డీకే అరుణ మాత్రం కెసిఆర్ అండ్ తెరాస పార్టీ పై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటు అసెంబ్లీ లో ఇటు బయట తెరాస వైఫల్యాల్ని ఎండగడుతూ శభాష్ అనిపించుకుంటోంది.ఇక తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ రాష్ట్ర పర్యటన […]

జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!

జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]