కాంగ్రెసోళ్ళూ సినిమా చూపించారు

తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తే, దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్‌ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]

ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!

ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్‌ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ […]

కాంగ్రెస్ కి షాక్ ఇచ్చిన చిరంజీవి

ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని ముందుకు నడిపించాలంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఆఫర్‌ని మెగాస్టార్‌ చిరంజీవి తిరస్కరించారని సమాచారమ్‌. కాంగ్రెసు పార్టీ నుంచి చిరంజీవి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాను సినిమాలపై దృష్టిపెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాల్ని చూసుకోలేకపోతున్నట్లుగా చిరంజీవి, ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసినప్పుడు వివరించారట. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ దాన్ని నడపలేక, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]

యువనేతకి సుప్రీం షాక్‌

పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనే విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెసు యువ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టైమ్‌ పాస్‌ కోసం చేసే విమర్శలు ఆయన్ని వివాదంలోకి లాగేస్తుంటాయి. తద్వారా ఆయన ఆ వివాదాల నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులూ పడాల్సి వస్తుంది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఓ సందర్భంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు, క్షమాపణ చెప్తారా? కేసు విచారణను ఎదుర్కొంటారా? […]

ఇప్పుడనుకొని ఏమా లాభం జైరాం గారూ!

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ పెద్దల్లో ఒకరైన జయరాం రమేష్ గారిగి పాపం ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయినట్టుంది.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కి జరిగిన నష్టం పూడ్చలేనిది నిట్టూర్చారు పాపం.ఎం చేస్తాం జైరాం గారూ ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్న నానుడి గుర్తుంది గా..అచ్చం అలాగే జరిగినదన్నమాట కాంగ్రెస్ కి. వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థులు వేరుగా వుండేయని అన్నారు.అయినా ఈయనకు ఈ నిజం ఇప్పటికి తెలిసిందేమో కానీ వైఎస్ఆర్ మరణించిన తరువాత […]

కాంగ్రెస్‌ పార్టీకి ఆ ధైర్యం లేకనే నా..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్‌ని, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎవర్నయినా ఎంపిక చేయవచ్చుగానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన షీలా దీక్షిత్‌ని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ‘ట్రంప్‌ కార్డ్‌’గా వాడుకోవాలనుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెసు పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కూడా ఇదే ఉత్తరప్రదేవ్‌ తరఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ […]

కాంగ్రెసోళ్ళకి వైఎస్సార్‌ గుర్తుకొచ్చిండు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని నేడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చాలా గట్టిగా స్మరించుకున్నారు. దివంగత నేత, సమైక్య తెలుగు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. పరిపాలనలో వివాదాలు ఎలా ఉన్నా అనేక పథకాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు రాజశేఖర్‌రెడ్డి. స్వతహాగా డాక్టర్‌ కావడంతో పేదవారు ఆరోగ్యం కోసం పడ్తున్న పాట్లు చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని వైఎస్సార్‌ […]