తెలంగాణ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు వేగులు

రాజ‌కీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొద‌వ ఉండ‌దు! ఇప్పుడు ఇదే టాక్‌పై తీవ్ర వ‌ర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు. తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయార‌ని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్ర‌భుత్వం చేయ‌ద‌ల్చుకున్న‌, చేస్తున్న ప‌నుల‌కు సంబంధించిన సీక్రెట్ స‌మాచారాన్నంతా పోగేసి.. ప‌క్కారాష్ట్ర సీఎం చంద్ర‌బాబుకి చేర‌వేస్తున్నార‌ట‌. దీంతో స‌ద‌రు స‌మాచారాన్ని ముందే గ్ర‌హిస్తున్న చంద్ర‌బాబు.. తెలంగాణ క‌న్నా రెండ‌డుగులు ముందుండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌! ఇలా మంత్రులే […]

బాబు ప్ర‌భుత్వంపై పోరాటానికి ప‌వ‌న్ రెడీ

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు ప్ర‌శ్నించే టైం వ‌చ్చిందా? అది కూడా మిత్ర‌ప‌క్షం, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబుపైనే ప‌వ‌న్ రెచ్చిపోతాడా?  బాబు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై రంకెలు వేస్తాడా? అంటే నిన్నటికి నిన్న జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న గోదావ‌రి మెగా ఫుడ్ పార్క్‌ని అక్క‌డి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మెగా ఫుడ్ ఫార్క్ ఏర్పాటుతో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను పొలాల‌కు పారే […]

ఎమ్మెల్యేల దోపిడీపై చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్‌

ఎన్నిక‌ల్లో పోటీచేసే నాయ‌కులు డ‌బ్బులు పంచిపెడుతుండ‌టం స‌హ‌జ‌మే! ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే! కానీ ఎవ‌రూ దీని గురించి  మాట్లాడ‌రు!! మ‌రి ఇటువంటి వాటి గురించి స్వ‌యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి మాట్లాడితే ఎలా ఉంటుంది?  నిజంగా ఆశ్చ‌ర్య‌మే క‌దూ! కానీ ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌ర‌చూ ఇటువంటి వ్యాఖ్య‌లే చేస్తూ ప్ర‌జ‌ల‌ను, నాయ‌కుల‌ను ఆశ్చర్య‌ప‌రుస్తున్నారు. రాజ‌కీయాల్లో విలువ‌లు దిగ‌జారిపోతుండ‌టంపై అస‌హ‌నం వ్య‌క్తంచేశారు. వెల‌గ‌పూడిలో సీఎం కార్యాల‌యాన్ని ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్ల పాటు […]

ఇలా అయితే బాబుకు సీఎం పోస్టు క‌ష్ట‌మే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఫ్యూచ‌ర్‌పై ఆశ‌లు అంత‌గా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు! ఏపీలో రానున్న రెండు ట‌ర్మ్‌ల వ‌ర‌కు టీడీపీనే అధికారంలో ఉండాల‌ని, తానే సీఎంగా పాలించాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌నే క‌సితో ఉన్న బాబు.. దానికి త‌గిన‌ట్టుగా పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం, త‌న పాల‌న‌కు మెరుగులు పెట్టుకోవ‌డం, నిరంతరం ప్ర‌జ‌ల్లో ఉండేలా ఏవో ఒక కార్య‌క్ర‌మాలు రూపొందించుకోవ‌డం జ‌రుగుతున్నాయి. […]

2019 కోసం వాళ్ల‌ను టార్గెట్ చేస్తోన్న జ‌గ‌న్‌

 గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..  ఇక త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే త‌రువాయి అన్నంతగా మితిమీరిన విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫ‌లితాలు వెలువ‌డ్డాక ఆ షాక్‌నుంచి చాన్నాళ్లు కోలుకోలేద‌నే చెప్పాలి. అయితే అధికార పీఠం చేరుకోవాలంటే.. ప్ర‌జ‌ల్లో త‌న‌పై మ‌రింత విశ్వాసం పెంచుకోవాల‌న్న వాస్త‌వ‌ ప‌రిస్థితి గ్ర‌హించాక అధికార ప‌క్షంపై ఆయ‌న ఒక‌రకంగా యుద్ధ‌మే చేస్తున్నారు. తండ్రిలాగే మ‌డ‌మ తిప్ప‌ని నైజ‌మున్న జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి ప్ర‌తిప‌క్షంగా గ‌ట్టిగానే పోరాడుతున్నా.. రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌డం, వ్యూహ ర‌చ‌నా […]

చంద్ర‌బాబు దెబ్బ‌కు వ‌ణికిన టైగ‌ర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కోప మొచ్చింది! అది అలాంటి ఇలాంటి కోపం కాదు. సొంత పార్టీ ఎమ్యెల్యే పైనే క‌ట్ట‌లు తెగే కోప‌మొచ్చింది. ఇంకేముంది ఉన్న‌చోట ఉన్న‌ట్టుగానే ఫైరైపోయారు. స‌ద‌రు ఎమ్మెల్య‌ను చ‌డామ‌డా తిట్టిపోశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి గిర్రున నీళ్లు తిర‌గినంత ప‌నైంద‌ట‌! దీంతో ఎన్న‌డూ త‌న జీవితం క్ష‌మించ‌మ‌ని ఎవ్వ‌రినీ అడ‌గ‌నివాడు.. సీఎంను ప‌ట్టుకుని క్ష‌మించ‌మ‌ని అడ‌గ‌డంతోపాటు ఫ్యూచ‌ర్‌లో ఇలా జ‌ర‌గ‌కుండా చూస్తానంటూ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశార‌ట‌. పోనీ.. ఆ ఎమ్మెల్యే ఏమ‌న్నా.. ఆషామాషీనా […]

చంద్ర‌బాబు డైలాగ్ జోకుల‌కే పెద్ద జోకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా పెద్ద హిట్‌! ఈ విష‌యంలో విప‌క్ష నేత‌లు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీక‌రించే విష‌యం. ఆయ‌నెప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆయ‌న ముఖంలో చూద్దామ‌న్నా న‌వ్వు క‌నిపించ‌దు. అలాంటి చంద్ర‌బాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్‌.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధ‌వారం నుంచి విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సీఎం చంద్ర‌బాబు.. ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య […]

జగన్‌ పట్టువదలని విక్రమార్కుడు.

ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీతో సరిపెట్టుకున్నప్పటికీ, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ మాత్రం ససేమిరా అంటోంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేననే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్‌ జగన్‌ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ముందుగా యువతలో ప్రత్యేక హోదాపై చైతన్యం కలిగిస్తున్నారాయన. ఓ వైపు పార్టీ వేదికలపైనా, ఇంకో వైపు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా, ఇవి కాకుండా తన మీడియా సంస్థల ద్వారా సమాజంలోని అన్ని […]

ఇచ్చారు, థ్యాంక్స్‌ చెప్పాను – తప్పేంటి!

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన ప్యాకేజీ బాగుందని, ఇచ్చిన విషయాల పట్ల సంతృప్తితో కేంద్రానికి థ్యాంక్స్‌ చెబితే తప్పేంటని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఏది ఇచ్చినట్టో, ఏది ప్రకటించి ఊరుకున్నట్లో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎలా అనుకోగలం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆంధ్రప్రదేశ్‌కి ప్యాకేజీ లాంటి సహాయం ప్రకటించడం కేవలం ఎన్నికల్లో ఇచ్చిన ప్రచారం తరహాలో మాత్రమే ఉంది. ఆ హామీలకు చట్ట […]