ఇక్కడ చిన్ని..అక్కడ నాని..టీడీపీలో ఏం జరుగుతోంది?

తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ వ్యవహారం అంతు చిక్కకుండా ఉంది. ఇటు ఎంపీ కేశినేని నాని, అటు టి‌డి‌పి నేత కేశినేని చిన్ని సీటు కోసం పోటీ పడుతున్నారా? లేక వారిద్దరు టి‌డి‌పి శ్రేణులని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు. విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నాని..అక్కడ ఉన్న టి‌డి‌పి లోకల్ లీడర్లతో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే లోకల్ గా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. సొంతంగా కార్యక్రమాలు […]

కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టి‌డి‌పిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బి‌ఆర్‌ఎస్ లో అనుకున్న మేర […]

బీజేపీతో బాబు..పురందేశ్వరి కష్టం..వారికి అంతా తెలుసా?

బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బి‌జే‌పికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]

నగరిలో ఆగని పోరు..రోజా తగ్గడం లేదా?

అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఆ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కొన్ని చోట్ల నేతలు సెట్ అవుతున్నారు..కానీ కొన్ని చోట్ల అవ్వడం లేదు. ఇదే క్రమంలో నగరి నియోజకవర్గంలో జరిగే ఆధిపత్య పోరుకు బ్రేకులు పడేలా లేవు. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు కొందరు వైసీపీ నేతలు యాంటీగా ఉన్నారు. ఎప్పటినుంచో రోజాకు […]

గల్లా-కేశినేని టీడీపీకి ఝలక్..తేల్చేసుకున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా […]

కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ఇంకా ఇంచార్జ్‌లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టి‌డి‌పి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి […]

గన్నవరం-గుడివాడలపై బాబు కన్ఫ్యూజన్..!

గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టి‌డి‌పిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]

మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]

ఇద్దరు సీఎంలతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకొని అలా వచ్చిన క్రేజ్‌తో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టార్ హీరో ఎం.జి రామచంద్రన్ ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా, నిర్మాతగా పనిచేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకుడు ఎం కరుణానిధి కూడా ఒకరు. వీరి […]