కైకలూరుపై జనసేన గురి..టీడీపీ వదులుకున్నట్లే.!

వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు..ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ఇంకా ఇంచార్జ్‌లు లేరు..ఆ సీట్లని వ్యూహాత్మకంగా చంద్రబాబు వదిలేశారా? జనసేనకు ఇవ్వడం కోసం ఖాళీగా ఉంచారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటులో టి‌డి‌పి ఇంచార్జ్ ఎవరు లేదు. మొన్నటివరకు ఇంచార్జ్ గా పనిచేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీలోకి […]

గన్నవరం-గుడివాడలపై బాబు కన్ఫ్యూజన్..!

గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టి‌డి‌పిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]

మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]

ఇద్దరు సీఎంలతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..!

చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకొని అలా వచ్చిన క్రేజ్‌తో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టార్ హీరో ఎం.జి రామచంద్రన్ ముందు వరుసలో ఉంటారు. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా, నిర్మాతగా పనిచేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజకీయ నాయకుడు ఎం కరుణానిధి కూడా ఒకరు. వీరి […]

హద్దులు దాటిన తముళ్ళు..గన్నవరంలో బూతుల పర్వం.!

ఏపీ రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం అనేది లేదు..ఒకప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉండేవి..ఇప్పుడు అవి దాటేసి.బూతుల పర్వంకు దిగారు. అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి నేతలు అదే పనిలో ఉంటున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంలో ముందున్నారు. ఎవరు తగ్గడం లేదు. తాజాగా గన్నవరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సభ జరిగింది. ఈ సభలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళంతా పాల్గొన్నారు. అటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు, […]

మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో […]

ఆసక్తిగా మంగళగిరి సమీకరణాలు… టీడీపీకి లాభమా… నష్టమా…!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ […]

ఎలక్షన్ టార్గెట్… దూకుడు పెంచిన చంద్రబాబు…!

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలవకపోతే… ఇదే తనకు చివరి ఎన్నికలు అనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు వ్యవహారం. ఇప్పటికే 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు 2029లో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఎన్నికల టార్గెట్‌గా చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు […]

పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]