సినీ ఇండ్ర‌స్టీలో తీవ్ర‌ విషాదం..సీనియ‌ర్ న‌టి క‌న్నుమూత‌!

సినీ ఇండ్ర‌స్టీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప‌లు దక్షిణాది చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న సీనియ‌ర్ న‌టి జయంతి క‌న్నుమూశారు. ఈమె వ‌య‌సు 76 సంవ‌త్స‌రాలు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌ల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయంతి.. అక్క‌డే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ, ఆరోగ్యం విష‌మిస్తూ ఉండ‌టంతో ఆదివారం రాత్రి జ‌యంతి తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న‌యుడు కృష్ణ‌కుమార్ అధికారికంగా ధృవీక‌రించారు. దాంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు […]

వామ్మో..యాడ్స్ ద్వారా స్నేహా దంప‌తులు అంత సంపాదిస్తున్నారా?

తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌ముఖ న‌టి స్నేహా.. 2012లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఇద్దు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్ద‌రూ కెరీర్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ జంట న‌టించే యాడ్స్‌కు సూప‌ర్ డిమాండ్ ఉంద‌ని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెర‌కెక్కించేందుకు ప‌లు కంపెనీలు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తార‌ట‌. ఇప్పటి వరకు […]

ఘ‌నంగా సాయి కుమార్ షష్టిపూర్తి వేడుక‌..పిక్స్ వైర‌ల్‌!

సీనియ‌ర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్‌.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా ద‌గ్గ‌ర బంధువులు, స‌న్నిహిత‌ల మ‌ధ్య ఈ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. సాయి కుమార్ దంపుత‌ల ష‌ష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంక‌టేష్‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన […]

`నార‌ప్ప‌` మేకింగ్ వీడియో..అద‌ర‌హో అనిపించిన‌ వెంకీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక క‌రోనా ప‌రిస్థితులు కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన నార‌ప్ప‌.. మంచి టాక్ తెచ్చుకుంది. సెల‌బ్రెటీలు సైతం […]

బాల‌య్య‌, చిరుల‌కు నో అన్న‌ ఆ భామ..మ‌హేష్‌కు ఓకే చెప్పిందా?!

చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ‌.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్య‌లో మొద‌ట త్రిష‌నే ఎంపిక చేయ‌గా.. ఆమె ప‌లు కార‌ణాల వ‌ల్ల ప‌క్క‌కు త‌ప్పుకుంది. అలాగే ఇటీవ‌ల బాల‌య్య‌, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్ర‌దించ‌గా.. నో చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాల‌య్య‌, చిరుల‌కు నో చెప్పిన ఈ భామ‌.. […]

మెగాహీరో కోసం మ‌రోసారి అలా చేయ‌డానికి సిద్ధ‌మైన త‌మ‌న్నా?!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో త‌మ‌న్నా కూడా మెర‌వ‌నుంద‌ట‌. బాక్సింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ […]

బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?

బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా […]

ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే…!

ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 01: ఆదివారం ఆగస్టు 08: ఆదివారం ఆగష్టు 13: పాట్రియాట్స్ […]

గోల్డ్_మెడల్ సొంతం చేసుకున్న భారతీయ వజ్రం..!

జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రారంభమైన విశ్వక్రీడా సంబురంలో భారత్ సత్తా చాటుతోంది. మీరాభాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించి బోనీ చేయగా, తాజాగా భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ ఒలింపిక్స్‌లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను భారత ఆటగాళ్లు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే హంగేరీలో నిర్వహించబడుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో […]