ప్రభాస్‌ను పట్టుకొస్తున్న తారక్.. తుక్కు రేగాల్సిందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షోకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఒకవైపు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో గట్టి పోటీనిస్తున్నా, తారక్ తనదైన యాంకరింగ్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌ను విజయవంతం చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్‌ను తీసుకొచ్చేందుకు అటు నిర్వాహకులు కూడా పెద్ద ప్లాన్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలను ఈ గేమ్ షోకు గెస్ట్‌లుగా పిలిచి […]

ఎలాంటి మార్పు లేదంటున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలకు ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఒక భాషలో తెరకెక్కిన చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ కోవలోనే వచ్చిన కన్నడ భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా, కన్నడ హీరో యశ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుందోచ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ చూసేందుకు యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ పలుమార్లు […]

సంక్రాంతి బరిలో అఖండ..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మె్న్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. షూటింగ్ ముగించుకున్న అఖండ చిత్రం రిలీజ్ […]

స్పెయిన్‌లో 3 వారాలు మకాం వేయ‌బోతున్న మ‌హేష్‌..కార‌ణం అదే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పెయిన్‌కి వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే మూడు వారాలు మ‌కాం కూడా వేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్‌.. షూటింగ్ ట్రిప్పే. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]

కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న రానా..స‌క్సెస్ అవుతాడా?

ద‌గ్గుబాటి రానా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో మంచి న‌టుడిగా స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయ‌కుడిగా మార‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్‌ బాగుంటుందని దర్శకుడికి […]

బిగ్‌బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆ బ్యూటీనే అట‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే 7ఆర్ట్స్ స‌ర‌యు, సీరియ‌ల్ న‌టి ఉమాదేవిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు. ఈ వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే.. శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేట్ అయ్యారు. వీరిలో మాన‌స్‌, శ్రీ‌రామ్‌లు భారీ ఓటింగ్‌తో దూసుకుపోతుండ‌గా.. వారి వెన‌క ప్రియాంక కూడా అత్య‌ధిక ఓట్లు ద‌క్కించుకుంటోంది. శ‌నివారం ఎపిసోడ్‌లో శ్రీ‌రామ్‌, ప్రియాంక‌ల‌ను […]

అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ క‌లిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే […]

అందవిహీనంగా మారిపోయిన ఆ స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా అడుగు పెట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా బిజీగా ఉంటుంది ఈమె.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం ఎప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు […]