బిగ్‌బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆ బ్యూటీనే అట‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే 7ఆర్ట్స్ స‌ర‌యు, సీరియ‌ల్ న‌టి ఉమాదేవిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు. ఈ వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే.. శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేట్ అయ్యారు.

Bigg Boss 5 Telugu: ఫాంలోకి వచ్చిన బిగ్‏బాస్.. రవి బండారం బట్టబయలు.. ఆ  వీడియోతో లహరికి షాకిచ్చాడుగా !! | Bigg boss 5 telugu latest promo host  nagarjuna fires on ravi and priya over lahari ...

వీరిలో మాన‌స్‌, శ్రీ‌రామ్‌లు భారీ ఓటింగ్‌తో దూసుకుపోతుండ‌గా.. వారి వెన‌క ప్రియాంక కూడా అత్య‌ధిక ఓట్లు ద‌క్కించుకుంటోంది. శ‌నివారం ఎపిసోడ్‌లో శ్రీ‌రామ్‌, ప్రియాంక‌ల‌ను నాగ్ సేవ్ చేసేశాడు. మాన‌స్ కూడా ఖ‌చ్చితంగా సేవ్ అయిపోతాడు. ఇక డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ది ఇద్ద‌రే ఇద్ద‌రు.. ప్రియ‌, ల‌హ‌రి.

Bigg Boss 5 Telugu: Priya Shocking Comments On Lahari Shari - Sakshi

అయితే ఈ ఇద్ద‌రిలో ప్రియ సేవ్ అవుతుంద‌ని.. ల‌హ‌రి ఎలిమినేట్ అవుతుంద‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ర‌వి, ప్రియ‌, ల‌హ‌రి ఇష్యూ వ‌ల‌న ల‌హ‌రికి బ్యాడ్ నేమ్ వ‌చ్చింద‌ని అందుకే ఆమెకు ఓటింగ్ త‌క్కువ‌గా ప‌డింద‌ని స‌మాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మ‌న‌ లేడీ అర్జున్‌రెడ్డికి బిగ్ బాస్ హైస్‌లో ఇదే లాస్ట్ డే అవుతుంది.