మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా ఎన్టీఆర్ సరసన ఆడిపాడిన ఈ అందాల భామ.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా మలయాళంలో మాత్రం మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
నటిగానే కాకుండా సింగర్‌గానూ తానేంటో ఫ్రూవ్ చేసుకున్న మమతా.. క్యాన్సర్ రావడంతో దాదాపు పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్య సెకెండ్స్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ భామ.. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మమతా కొద్ద కారు కొనుగోలు చేసింది.
`ఫోర్ష్911 కారెర్రా` మోడల్‌కు చెందిన ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. మమతా కొనుగోలు చేసిన కారు ధర అక్షరాల రూ.1.80 కోట్లు. ఇక తన కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన మమతా.. `నా కల నిజమైంది. దీని కోసం దశాబ్దం పాటు ఎదురుచూశాను. ఫైనల్లీ ఇప్పుడు దీన్ని సొంతం చేసుకున్నా. ఎంతో సంతోషంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చింది.