స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకున్న పవన్..నెట్టింట వీడియో వైర‌ల్‌!

September 26, 2021 at 8:26 am

స్టేజ్‌పై పవన్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ అభిమానుల‌ను విసుక్కో లేదు. కానీ, తాజాగా మాత్రం ప‌వ‌న్‌ స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేపోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Pawan Kalyan: రిప‌బ్లిక్ ఈవెంట్‌గా జ‌గ‌న్‌ని ఏకిపారేసిన ప‌వన్ క‌ళ్యాణ్‌..!  | The News Qube

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్ ` షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ క్ర‌మంలోనే నిన్న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో మీడియా, వైసీపీ ప్ర‌భుత్వం, ఇండస్ట్రీలోనిపెద్దలు ఇలా అంద‌రినీ ఏకిపారేశారు.

Republic | Trailer | Sai Tej | Aishwarya Rajesh | Jagapathibabu | Ramya |  Deva Katta | Oct 1st - YouTube

అయితే స్టేజ్‌పై ప‌వ‌న్ మాట్లాడుతుండ‌గా.. ఓ అభిమాని ట‌క్కున స్టేజ్ మీద‌కు వ‌చ్చి ఆయ‌న్ను ట‌చ్ చేయ‌బోయాడు. దాంతో ఒక్కసారిగా అతన్ని మెడపై చెయ్యి పెట్టి పక్కకి నెట్టేసి.. హే పక్కకిపో.. పక్కిపో.. వెళ్లూ అని చిందులు తొక్కారు. ఆగ్రహంతో ఊగిపోయారు పవన్. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకున్న పవన్..నెట్టింట వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts