క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి స్పందించిన అనుష్క శెట్టి..!

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉంటుందన్న విషయం అందరికీ బాగా తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది సినీ తారలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ ఇస్తేనే సినీ ఇండస్ట్రీలో నటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు.హీరోయిన్ అనుష్క ఈ విషయంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్నైట్ కి స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. మీరు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని ఎదుర్కొన్నారు అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఇదే.. సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. నా వరకు ఇప్పటివరకు అలాంటి ఇబ్బందులు రాలేదు.. ఎందుకంటే నేను ఎప్పుడు ముక్కుసూటిగా నేను మాట్లాడుతాను.. నా పనేదో నేను చూసుకుంటాను అందువల్ల నాతో మాట్లాడడానికి చాలామంది సాహసం చేయాలని తెలియజేసింది.

ఇక అంతే కాకుండా అడ్డదారుల్లోను వెతుక్కుంటూ ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలబడలేమని.. కష్టపడి సంపాదించిన వచ్చిన గుర్తింపు వారికి సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలిచేలా చేస్తుంది.ప్రస్తుతం అనుష్క చంద్రముఖి-2 సినిమాలో నటిస్తోంది.