అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!

September 25, 2021 at 7:49 pm

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ క‌లిసి నిర్మించారు.

Pooja Hegde, Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal  2021; first poster unveiled-Entertainment News , Firstpost

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు.

Most Eligible Bachelor OTT Platform, OTT Release Details

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం మ‌ళ్లీ వాయిదా ప‌డింద‌ట‌. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంటే అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts