సంక్రాంతి బరిలో అఖండ..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మె్న్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. షూటింగ్ ముగించుకున్న అఖండ చిత్రం రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని వారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా సమయం తీసుకుంటుండటంతో ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు బడా చిత్రాలు రిలీజ్ డేట్‌లను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ జాబితాలో భీమ్లా నాయక్ జనవరి 12న, సర్కారు వారి పాట జనవరి 13న, రాధేశ్యామ్ జనవరి 14న రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

మరి ఇంతటి పోటీలో అఖండ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా తమ అభిమాన నటుడి చిత్రం సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని వారు అంటున్నారు. మరి ఇంతటి పోటీని తట్టుకుని అఖండ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.