అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినీ అభిమానుల నోళ్లలో నానుతోన్న హీరోయిన్ శాలినీ పాండే ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైంది. అర్జున్‌రెడ్డి సినిమాతోనే ఆమెకు మంచి ఇమేజ్ రావడంతో ఆమెకు పలు పెద్ద సినిమాల్లో ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె చేత కొందరు షాపింగ్ మాల్స్, సెల్ పాయింట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శాలినీ పాండే ఈ రోజు నెల్లూరులో ఓ సెల్‌పాయింట్ ప్రారంభించడానికి వెళ్లింది. ఆమె అక్కడ […]
Author: admin
సీమలో వైసీపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు జంప్
ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో లేడీ
తెలంగాణలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్నప్పుడు, గత ఎన్నికల్లోను వీరిద్దరి మధ్య ఎంతో సఖ్యత ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]
విశ్వేశ్వర్‌రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా?
అనంతపురం జిల్లాలోని వెనకబడిన నియోజకవర్గాల్లో ఉరవకొండ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోవడం విశేషం. విచిత్రం ఏంటంటే కేశవ్‌పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి 2004లో సీపీఐ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి గత ఎన్నికల్లో మూడోసారి పార్టీ మారి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేసి కేశవ్‌పై ఎట్టకేలకు 2275 ఓట్ల స్వల్ప ఓట్ల […]
టెన్షన్ పెడుతోన్న’ జై లవకుశ ‘ రన్ టైం
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాలలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా ఒకటి. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్స్, పాటలకు, ట్రైలర్ అన్నీ బాగుండటంతో ఈ సినిమాకు తారక్ కెరీర్‌లోనే […]
‘ స్పైడర్ ‘ స్టోరీ…. మరో ప్రపంచంలోకి ఎంట్రీ ఖాయం
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ ఈ నెల 27న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి వస్తోన్న లీకులు సినిమాపై హైప్‌ను మరింత పెంచడంతో పాటు రొమాటు నిక్కపొడుచుకునేలా ఉంది. స్టోరీ లైన్ వింటుంటేనే ఇలా ఉందంటే ఇక తెరమీద చూస్తే ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు. మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొందరు విదేశీ ఉగ్రవాదులు మన దేశ ప్రజలను […]
టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్
ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంతానికి పోవడంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షం కావడంతో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]
కేసీఆర్, బాబులకు చిచ్చు పెట్టిన ఐలయ్య
ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి ఆయన వివాదం లేకపోతే.. నాగురించి ఎవరు పట్టించుకుంటారు? అని అనుకుంటారో ఏమో? ఆయన ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా వివాదంతోనే ఉంటారు. ఈ వివాదాలు రానురాను ప్రభుత్వాలను తెగ ఇరుకున పెడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన గమనించాల్సిన అవసరం ఉందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. విజ్ఞులు, మేధావులు అయిన వాళ్లే.. తమ తమ వ్యక్తిగత ప్రచారం కోసం వివాదాలను ప్రోత్సహించడం […]
‘ జై లవకుశ ‘ స్టోరీ ఇదే
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉండడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడం, అందుకు తగ్గట్టుగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందా ? ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఎలా రక్తి కట్టిస్తుందా ? సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని జనాలు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ […]
