జనతా గ్యారేజ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమాల్లో ఉండే కలర్ షేడ్ కనిపిస్తోంది. అదే తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దాంతో అలనాటి వర్మ ‘శివ’ సినిమా తరహాలో కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ని రూపొందించాడా? అని సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.
అదే కనుక నిజమైతే అప్పట్లో వర్మ సినిమాలు సృష్టించిన సెన్సేషనే వేరు. అందులో ‘శివ’ సినిమా సంచలనం మరో ఎత్తు. ఇప్పటికే జస్ట్ టీజర్‌తోనే సంచలనం సృష్టిస్తోంది ‘జనతా గ్యారేజ్’. ఇక సినిమా ఏ రేంజ్లో సెన్సేషన్ అవుతుందో అని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌కి ఈ సినిమా కూడా విజయం తెచ్చిపెడితే మళ్లీ ఇదివరకటి వైభవం యంగ్ టైగర్ని సమీపించినట్లే. నెంబర్ వన్ రేంజ్‌కి పోటీగా నిలిచినట్లే అంటున్నారు కూడా సినీ పెద్దలు.
వచ్చే నెల మొదటి వారంలో సినిమా విడుదల కానుంది. సమంత, నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐఐటీ స్టూడెంట్‌గా కనిపిస్తాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కి గ్యారేజ్‌తో పనేంటో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. అందుకోసం సెప్టెంబరు 2 వరకూ వేచి చూడాల్సిందే.