`స్పైడర్` మ్యానియా మొదలైంది! అటు ఏపీతో పాటు తమిళనాడు బాక్సాఫీస్‌లను కొల్లగొట్టేందుకు ప్రిన్స్ మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పాటలు, టీజర్ ద్వారా ప్రేక్షకులకు కావాల్సిన హంగులన్నీ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది! తొలిసారి మహేశ్.. తమిళంలో ఇంట్రడ్యూస్ అవ్వడం.. అందులోనూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో రావడంతో అంచనాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. స్పైడర్ ఏతరహా మూవీనో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు అభిమానులు అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులతో పంచుకున్నారు.
స్పైడర్ ఏ తరహా సినిమా అన్న విషయాన్ని చెబుతూ.. మురుగుదాస్ తీసే సినిమాలు రెండు రకాలుగా ఉంటాయని.. ఇది పూర్తిస్థాయి జేమ్స్ బాండ్ మూవీ కాదన్నారు. రమణ(తెలుగులో ఠాగూర్).. కత్తి తరహా ఎమోషనల్ మూవీస్ చేసే మురుగుదాస్.. గజిని.. తుపాకి తరహా స్టయిలిష్ మూవీస్ చేస్తుంటారని తాజా స్పైడర్ రెండో తరహాకు చెందిన మూవీగా చెప్పాడు. స్పైడర్ మూవీలో తానో ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఆఫీసర్ అని చెప్పాడు. ఈ మూవీలో యాక్షన్ పార్ట్‌కు చాలా స్కోప్ ఉందని.. శారీరకంగా తాను చాలా కష్టపడినట్లు చెప్పిన మహేశ్.. ఈ మూవీలో చాలా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని.. రెగ్యులర్ గా చూసే సినిమాలకు భిన్నమైన యాక్షన్ ఘట్టాలున్నాయని తెలపారు.
రెండువేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిసి చేసిన సీక్వెన్స్ లు అదిరిపోతాయని చెబుతున్నాడు. సినిమాలో కనిపించే ప్రతి చిన్న అంశం కథతో లింకై ఉండటం మురుగుదాస్ గొప్పతనంగా పొగిడారు మహేశ్. స్పైడర్ లో ఎంపిక చేసుకున్న టెక్నికల్ టీం అదిరిపోయేలా ఉంటుందని.. డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్.. మ్యూజిక్ డైరెక్టర్.. ఫైట్ మాస్టర్.. ఇలా అందరూ హై ఎండ్ టెక్నికల్ స్టాఫ్ అని.. వీరందరితో కలిసి పని చేయటం నటుడిగా తానెంతో నేర్చుకోవటానికి సాయం చేసిందన్నాడు. తొలిసారి రెండు భాషల్లో నటించిన అనుభవం సరికొత్తగా ఉందన్నాడు మహేశ్. షూటింగ్ స్టార్ట్ చేసిన మొదటి ఐదు రోజులైతే అసలేమీ అర్థం కాలేదు. లోతుకు దిగిపోయామా? అన్న టెన్షన్ వచ్చేసిందన్నారు.
తన కెరీర్ లో భారీ అంచనాలతో విడుదలై.. దారుణంగా ఫెయిల్ అయిన చిత్రాల్లో ఒకటి బ్రహ్మోత్సవం. దాని గురించి చెబుతూ.. బ్రహోత్సవం లాంటి ప్లాప్స్ వచ్చినప్పుడు కచ్ఛితంగా డిప్రెషన్ ఉంటుందని.. దాని నుంచి తనను బయట పడేసింది తన పిల్లలే అని చెప్పాడు. ఈ సినిమా చేయటం రాంగ్ డెసిషన్ అని.. దాని వల్ల చాలామంది డబ్బులు పోయాయని.. తాను చాలా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమన్నాడు. నమ్మి డబ్బులు పెట్టినోళ్లు నష్టపోతే ఆ బాధను మాటల్లో వివరించలేనని.. అలాంటి అనుభవాలే పాఠాలుగా తీసుకొని మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెప్పాడు ప్రిన్స్!!