యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్లో బాలయ్య సరికొత్తగా ట్రై చేసిన ఈ సినిమాలో బాలయ్య యాట్టిట్యూడ్, మేనరిజమ్స్, లుక్స్, స్టైల్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని సరికొత్తగా ఉన్నాయి.
పైసా వసూల్ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు ఏపీ+తెలంగాణలో కలుపుకుని దాదాపు 8 కోట్ల షేర్ సాధించడం విశేషం. బాలయ్యకు ఇదే ఫస్ట్ డే హయ్యస్ట్ ఓపెనింగ్ వసూళ్లు కావడం విశేషం.
శనివారం బక్రీద్ సెలవు, ఆదివారం కూడా సెలవు కావడంతో సినిమాకు ఫస్ట్ వీకెండ్ అదిరిపోయే వసూళ్లు రానున్నాయి. పైసా వసూల్ ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.
నైజాం – 1.64 కోట్లు
సీడెడ్ – 1.8 కోట్లు
నెల్లూరు – 37 లక్షలు
గుంటూరు – 1.54 కోట్లు
కృష్ణా – 52 లక్షలు
ఉత్తరాంధ్ర – 80 లక్షలు
ఈస్ట్ – 70 లక్షలు
వెస్ట్ – 58 లక్షలు
————————
టోటల్ = 7.96 కోట్లు
————————